Pranab Mukherjee Funeral: ఇక సెలవు..మధ్యాహ్నం 2 గంటలకు లోధి గార్డెన్ స్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు, రాజాజీమార్గ్‌లోని అధికారిక నివాసానికి చేరుకున్న ప్రణబ్ పార్థీవ దేహాం
తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించనున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, వీఐపీలు అంజలి ఘటించనున్నారు.
New Delhi, September 1: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సోమవారం కన్నుమూయగా (Pranab Mukherjee dies at 84) మంగళవారం ఉదయం 8గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని అధికారిక నివాసానికి తరలించారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించనున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, వీఐపీలు అంజలి ఘటించనున్నారు.
ఆ తరువాత 11 గంటల నుంచి 12 గంటల వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సైనిక గౌరవ వందనం సమర్పించనున్నారు. 2 గంటలకు లోధి గార్డెన్‌లోని స్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు (President's Last Rites) నిర్వహించనున్నారు.
కరోనావైరస్ సోకటంతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చేరారు. ఆయన మెదడు రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరోగ్యం మరింత క్షీణించటంతో కోమాలోకి వెళ్లారు. తమ తండ్రి తుదిశ్వాస విడిచారని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘మా నాన్నగారు ప్రణబ్‌ముఖర్జీ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయనను బ్రతికించేందుకు ఆర్‌ఆర్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా కృషిచేసినప్పటికీ దేశప్రజలంతా ఆయన కోలుకోవాలని దీపాలు వెలిగించి ప్రార్థనలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది’ అని పేర్కొన్నారు. జర్నలిస్టు నుంచి రాష్ట్రపతి దాకా.., ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాకుండా అడ్డుపడిందెవరు?
21రోజులుగా సైనిక రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ఊపిరితిత్తులు కొవిడ్-19 కారణంగా తీవ్రంగా చెడిపోయాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కోమాలో ఉండగానే సోమవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తీవ్ర గుండెపోటు రావటంతో తుదిశ్వాస విడిచినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు
ప్రణబ్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ర్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. స్కూలు చదువు కోసం రోజూ 10 కిలోమీటర్ల నడక
మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపసూచకంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాపదినాలు ప్రకటించింది. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నింటి పైన జాతీయ పతాకాన్ని అవనతంచేశారు.