Pranab Mukherjee Passes Away: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన 'దాదా', అధికారికంగా ధృవీకరించిన ఆయన కుమారుడు
Former President Pranab Mukherjee | File Image | (Photo Credits: PTI)

New Delhi, August 31:  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల ప్రయత్నాలు, ప్రజల ప్రార్థనలు ఫలించలేదని, తన తండ్రి కొద్దిసేపటి కిందటే చనిపోయారన్న సంగతి పేర్కొనడం చాలా బాధగా ఉందన్నారు. చనిపోయే నాటికి ప్రణబ్ ముఖర్జీకి 84 ఏళ్లు, ఆయనకు కొవిడ్19 సోకడంతో ఆర్మీ ఆసుపత్రిలో చేరారు, దీనితో పాటు వయసు పైబడటంతో ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడ్డారు.

ఇటీవల ప్రణబ్ మెదడులో రక్తం గడ్డకట్టంతో వైద్యులు ఆయనకు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి తోడు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా ఆయన గత కొన్నిరోజులుగా కోమాలో ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వెంటిలేట‌ర్ స‌పోర్టుతో ఉన్న ప్రణబ్ ఆరోగ్యం సోమవారం ఉదయం నాటికి మరింత విషమించినట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు సాయంత్రం నాటికి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినట్లు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రణబ్ దాదా జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం

కాగా నిన్నటి నుంచి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన ‘సెప్టిక్‌ షాక్‌’లోకి (septic shock) వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చింది. వెంటిలేటర్‌ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపిన కొద్ది గంటలకే ప్రణబ్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లగా అప్పటి నుంచి డాక్టర్లు బతికించడం కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా

సాధారణంగా ‘సెప్టిక్ షాక్‌’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్‌లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే అనుకోవాలి. ప్రణబ్ విషయంలో అదే జరిగిందని తెలుస్తోంది.

Abhijit Mukherjee Tweet

ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఇక ప్రణబ్‌ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. అయినా ఆయన కోరిక ఫలించలేదు. ప్రణబ్ దివికేగారు. కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.