Former President Pranab Mukherjee | File Image | (Photo Credits: PTI)

New Delhi, August 10: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ (Former President Pranab Mukherjee) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్‌ ట్వీట్ ( Pranab Mukherjee COVID 19) చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అందించిన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386

గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్‌ కేసులతో 22 లక్షల కేసులను అధిగమించిందని, 44 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికవరీ రేటు 69.33 శాతంగా ఉందని, మరణాల రేటు కొత్త కనిష్టాన్ని (2 శాతం) చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Here's The Tweet: 

ప్రణబ్ ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అలాగే పలువురు బీజేపీ ఎంపీలు కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం కూడా విదితమే.