Pranab Mukherjee Health Update: లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ప్రణబ్ ముఖర్జీ, మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్, ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి
మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు.ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో (Ventilator Support) ఉన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి (Former President Pranab Mukherjee) బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్‌అండ్‌ఆర్ ఆసుపత్రిని సందర్శించి, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.
New Delhi, August 11: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు.ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో (Ventilator Support) ఉన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి (Former President Pranab Mukherjee) బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్‌అండ్‌ఆర్ ఆసుపత్రిని సందర్శించి, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాంగ్రెస్ దిగ్గజం, తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని వినతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీకి ఉపరాష్ట్రపతి ఇవాళ ఫోన్ చేశారని ప్రకటనలో తెలిపింది. ప్రణబ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రణబ్ త్వరగా కోలుకోవాలని వెంకయ్య అభిలషించినట్టుగా ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
ఈ సందర్భంగా ముఖర్జీ ట్వీట్ చేస్తూ... తాను సాధారణ వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా, కోవిడ్ -19 టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. గత వారం రోజులుగా తనను కలుసుకున్నవారంతా కోవిడ్ -19 పరీక్షించుకోవాలని కోరుతున్నానని అన్నారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించారు.