Pranab Mukherjee's Last Rites: ముగిసిన ప్రణబ్‌ ముఖర్జీ అంతిమ యాత్ర, అంతిమ సంస్కారాలు నిర్వహించిన అభిజిత్ ముఖర్జీ, సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Pranab Mukherjee's Last Rites (Photo-ANI)

New Delhi, September 1: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ అంతిమ యాత్ర (Pranab Mukherjee's Last Rites) ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఆశ్రునయనల మధ్య ఆయనకు (Pranab Mukherjee) వీడ్కోలు పలికారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రణబ్‌ పార్థివ దేహంపై సైనికులు జాతీయ పతాకం ఉంచారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారమే ఈ కార్యక్రమం పూర్తిచేశారు. కరోనాతో పోరాడి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Abhijit Mukherjee performs last rites of former President Pranab Mukherjee: 

కోవిడ్ నిబంధనల ప్రకారం.. సైనిక లాంఛనాలతో ప్రణబ్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ప్రణబ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసం నుంచి ఆయన పార్థీవ దేహాన్ని అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. సాధారణంగా ప్రముఖుల అంతిమ యాత్ర పుష్పాలతో అలంకరించిన గన్ క్యారేజీ వాహనంలో సాగుతుంది. కానీ కరోనా కారణంగా అంబులెన్స్‌లో ప్రణబ్ పార్థీవ దేహాన్ని తీసుకెళ్లారు. స్కూలు చదువు కోసం రోజూ 10 కిలోమీటర్ల నడక, జర్నలిస్టు నుంచి రాష్ట్రపతి దాకా

అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 10 రాజాజీ మార్గ్ నివాసంలో ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడి ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు.