Prashant Kishor New Party: పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్, గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ ప్రకటించనున్న పోల్ స్ట్రాటజిస్ట్, ఇంతకీ పార్టీ పేరేంటో తెలుసా?
ప్రస్తుతం ఆయన జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్న చేపడుతున్న విషయం తెలిసిందే. అదే పేరును పార్టీకి పెట్టబోతున్నట్లుగా ఆదివారం ప్రకటించారు
Patna, July 28: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ (Prashant Kishore) కొత్త రాజకీయ పార్టీని (New political Party) స్థాపించబోతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని (Jan Suraaj Party) నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్న చేపడుతున్న విషయం తెలిసిందే. అదే పేరును పార్టీకి పెట్టబోతున్నట్లుగా ఆదివారం ప్రకటించారు. పట్నాలోని బాపు సభాఘర్‌లో జన్ సురాజ్ పార్టీని ప్రారంభిస్తామని.. లక్ష మందికిపైగా ఆఫీస్ బేరర్లతో పార్టీ ప్రారంభమవుతుందన్నారు. తాను జన్ సురాజ్ పార్టీకి పార్టీ సభ్యులు నాయకులను ఎన్నుకుంటారని ఎన్నికల వ్యూహకర్త తెలిపారు. బిహార్‌కు మంచి ప్రత్యామ్నాయం లేదన్నారు.
మెరుగైన విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ కోసం బిహార్‌కు చెందిన తర్వాతి తరాల ప్రజలు రాష్ట్రం విడిచి వెళ్లకుండా కృషి చేయాలన్నారు. భవిష్యత్తు తరాలు మంచి రేపటి కోసం.. మీరంతా కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ప్రకటించారు. పార్టీ నాయకత్వం గురించి మాట్లాడుతూ.. ఏడుగురు సభ్యుల కమిటీ ఆగస్టు 15 నుంచి ఆగస్టు 20 వరకు పార్టీలోని 25 అత్యున్నత పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. కమిటీలో సమస్తిపూర్ నుంచి డాక్టర్ భూపేంద్ర యాదవ్, బెగుసరాయ్ నుంచి ఆర్‌ఎన్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ సురేశ్ శర్మ, సివాన్ నుంచి న్యాయవాది గణేశ్ రామ్, తూర్పు చంపారన్ నుంచి డాక్టర్ నసీమ్, భోజ్‌పూర్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ సింగ్, ముజఫర్‌పూర్ నుంచి స్వర్ణలతా సాహ్ని ఉంటారని కిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ మనుమరాలు జాగృతి ఠాకూర్ సైతం హాజరయ్యారు.