Premraj Arora Dies of Heart Attack: జిమ్‌లో వర్కవుట్ చేసిన కాసేపటికే మాజీ మిస్టర్ ఇండియాకు హార్ట్ ఎటాక్‌, షవర్ కింద స్నానం చేస్తూనే కుప్పకూలిన బాడీబిల్డర్, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూత

రాజస్థాన్‌లోని కోటాలో (Kota) జిమ్‌లో వర్కవుట్ చేసిన మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్ రాజ్ అరోరా ప్రెషప్‌ అయ్యేందుకు బాత్రూంకు వెళ్లాడు. అక్కడ షవర్ ఆన్ చేసిన కాసేపటికే కుప్పకూలాడు.

Premraj Arora Dies (PIC@ Twitter)

Kota, May 25: చిన్న వయస్సులో గుండెపోట్లతో మరణాలు ఆగడం లేదు. ఇప్పటికే చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలను చూస్తూ ఉన్నాం. కేవలం చిన్నారులు, వృద్ధులు మాత్రమే కాదు, ఫిట్‌గా ఉండేవాళ్లు కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్‌రాజ్ అరోరా (Premraj Arora Dies) జిమ్‌లో వర్కవుట్ చేసి స్నానం కోసం (Shower After Workout) వెళ్లి అక్కడే హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. రాజస్థాన్‌లోని కోటాలో (Kota) జిమ్‌లో వర్కవుట్ చేసిన మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్ రాజ్ అరోరా ప్రెషప్‌ అయ్యేందుకు బాత్రూంకు వెళ్లాడు. అక్కడ షవర్ ఆన్ చేసిన కాసేపటికే కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

42 సంవత్సరాల ప్రేమ్ రాజ్‌ అరోరాకు (Premraj Arora) ఇద్దరు కూతర్లు ఉన్నారు. ఎంతో ఫిట్‌ గా ఉండే ప్రేమ్‌ రాజ్ చలాకిగా ఉండేవాడని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎప్పుడూ వర్కవుట్లు చేసే ప్రేమ్‌ రాజ్ ఇలా హార్ట్ ఎటాక్‌తో (Premraj Arora) చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Two More Cheetah Cubs Die: ప్రాజెక్టు చీతాకు ఎదురు దెబ్బ, మరో రెండు చిరుత పిల్లలు మృతి, ఐదుకు చేరిన మరణించిన చిరుతల సంఖ్య 

గతంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ (Punit Rajkumar) కూడా ఇలాగే వర్కవుట్ చేస్తున్న సమయంలోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పటి నుంచి అనేక పుకార్లు వినిపించాయి. అతిగా వర్కవుట్లు చేయడం వల్లనే అనర్ధాలు వస్తున్నాయని పలువురు చెప్తున్నారు. తాజాగా ప్రేమ్‌ రాజ్ మరణంతో ఆ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది.



సంబంధిత వార్తలు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?