కేంద్రం చేపట్టిన ప్రాజెక్ట్‌ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి. నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.తీవ్రమైన వేడి కారణంగా వాటి ఆరోగ్యం క్షీణించింది పార్క్‌ అధికారులు పేర్కొంటున్నారు. వీటి మరణంతో కునో నేషనల్‌ పార్క్‌లో రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)