Prithvi Shaw Attacked: సెల్ఫీలు ఇవ్వనందుకు టీమిండియా బ్యాట్స్ మెన్‌పై బ్యాట్‌తో దాడి, ముంబైలో పృథ్వీషాపై అటాక్ చేసిన అభిమానుల గుంపు

మ‌రిన్ని సెల్ఫీలు కావాలంటూ (Physical Fight With Woman) క్రికెట‌ర్ వెంట ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆ అభిమానుల్ని పృథ్వీ షా నివారించారు. హోట‌ల్ మేనేజ‌ర్‌ను పిలిపించి ఆ అభిమానుల్ని బ‌య‌ట‌కు పంపించారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ఆ అభిమానులు క్రికెట‌ర్‌ను వెంటాడారు.

Prithvi Shaw In Physical Fight (PIC @ Screen garb from viral video)

Mumbai, FEB 16: క్రికెట‌ర్ పృథ్వీ షాతో (Prithvi Shaw) అభిమానులు గొడ‌వ ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో 8 మందిపై కేసును రిజిస్టర్ చేశారు. సెల్ఫీలు (Prithvi Shaw ) ఇచ్చేందుకు పృథ్వీ షా నిరాక‌రించ‌డంతో.. ఆ క్రికెట‌ర్ అభిమానులు అత‌నిపై దాడి చేశారు. క్రికెటర్ కారును ఛేజ్ చేసి.. బేస్‌బాల్ బ్యాట్‌తో అటాక్ చేశారు. ముంబైలోని ఓషివారాలో ఉన్న ఓ ల‌గ్జరీ హోట‌ల్ వ‌ద్ద పృథ్వీ షాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించారు. తొలుత కొన్ని సెల్ఫీలు దిగిన కొంద‌రు.. మ‌రిన్ని సెల్ఫీలు కావాలంటూ (Physical Fight With Woman) క్రికెట‌ర్ వెంట ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆ అభిమానుల్ని పృథ్వీ షా నివారించారు. హోట‌ల్ మేనేజ‌ర్‌ను పిలిపించి ఆ అభిమానుల్ని బ‌య‌ట‌కు పంపించారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ఆ అభిమానులు క్రికెట‌ర్‌ను వెంటాడారు.

ఫ్రెండ్‌తో క‌లిసి హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పృథ్వీ షాపై అభిమానులు అటాక్ (Cricketer Get in Brawl) చేశారు. కారులో వెళ్తున్న పృథ్వీని ఛేజ్ చేశారు. ఆ త‌ర్వాత బేస్‌బాల్ బ్యాట్‌తోనూ క్రికెట‌ర్‌పై అటాక్ చేసే ప్రయ‌త్నం చేశారు. పృథ్వీ నుంచి 50 వేలు డిమాండ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. శోభిత్ ఠాకూర్‌, స‌ప్నా గిల్ ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. పృథ్వీనే త‌మ‌పై ముందుగా దాడి చేసిన‌ట్లు వాళ్లు పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు