Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.

Law (photo-ANI

Newdelhi, Nov 2: దంపతులైన భార్యభర్తలిద్దరికీ (Wife-Husband) వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది. ఓ భర్త సమర్పించిన భార్య కాల్‌ రికార్డ్స్‌ డాక్యుమెంట్స్‌ ను సాక్ష్యంగా పరిగణించేందుకు కోర్టు ఈ సందర్భంగా తిరస్కరించింది. గోప్యతా హక్కును ఉల్లంఘిస్తూ సంపాదించే ఏ పత్రమైనా న్యాయస్థానాల్లో సాక్ష్యంగా చెల్లబోదని వివరించింది. భార్య వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ఆమెకు తెలియకుండా, ఆమె సమ్మతి లేకుండా పొందడాన్ని పరిగణించలేమని చెప్పింది. భార్యపై భర్త కానీ, భర్తపై భార్య కానీ నిఘా పెట్టకూడదని తెలిపింది.

పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

అసలేం జరిగింది?

వ్యభిచారం, క్రూరత్వాలకు పాల్పడుతున్న తన భార్య నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త కోరుతున్నాడు. తన భార్య తప్పు చేసిందని నిరూపించడానికి ఆమె కాల్‌ రికార్డ్స్‌ ను రహస్యంగా సంపాదించాడు. అయితే, ఈ కేసులో తన భర్త సమర్పించిన కాల్‌ రికార్డ్స్‌ ను సాక్ష్యంగా అనుమతించరాదని భార్య తమిళనాడులోని పరమకుడి సబ్‌ కోర్టును కోరారు. కానీ సబ్‌ కోర్టు ఆమె పిటిషన్‌ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టులో అపీలు చేశారు. దీనిపై ఉన్నత ధర్మాసనం స్పందిస్తూ ఈ కాల్‌ రికార్డ్స్‌ ను సదరు భర్త దొంగతనంగా సంపాదించినందువల్ల తన భార్య వ్యక్తిగత గోప్యత హక్కును ఆ భర్త ఉల్లంఘించారని, ఈ పత్రాలు సాక్ష్యంగా అనుమతించదగినవి కాదని హైకోర్టు తీర్పు చెప్పింది.

వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు