Hyderabad, Nov 2: హైదరాబాద్ (Hyderabad) లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో (Parking Car) ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. పిల్లలు దాదాపు 40 శాతం వరకు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఎవరైనా చేయించారా? అనే దానిపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video:
కారులో మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు..
హైదరాబాద్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరెడ్డి నగర్ లో ఘటన
పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ప్రమాదంలో చిన్నారులు జశ్విత(4), మహేశ్వరి(6)కి గాయలు#Hyderabad #Car #FireAccident #BigTV pic.twitter.com/B7QSi3gESJ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2024
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ప్రాంతంలో వెంకటరెడ్డి నగర్ లో శుక్రవారం రాత్రి ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దాదాపుగా 40 శాతం కాలిపోయారు. బాధిత చిన్నారులను జశ్విత (4), మహేశ్వరి(6) గా గుర్తించారు. చిన్నారిలిద్దరూ అదే కాలనీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కాలిపోయిన చిన్నారుల ట్రీట్ మెంట్ నిమిత్తం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.