Srikakulam, June 21: ఏపీలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి లో నిన్న పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు (Rescue team catches Bear) చిక్కింది. ఆ ఎలుగబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన రెస్క్యూ టీమ్.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది. ఆ ఎలుగుబంటిని యానిమల్ రెస్క్యూ సెంటర్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.నిన్నటి నుంచి కిడిసింగి శారదా పురం తోటలో నివసిస్తున్న ప్రజల్ని ఎలుగుబంటి భయభ్రాంతులకు గురిచేసింది.
ఆ క్రమంలోనే పలువురిపై దాడి చేసి గాయపర్చింది. ఈ దాడిలో ఓ రైతు మృతి చెందారు. దాంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. రెస్క్యూ టీమ్ సహాయంతో చివరకు దాన్ని పట్టుకున్నారు. ముందుగా ఓ ఇంట్లో ఎలుగుబంటి ఉన్నట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. అందుకోసం స్పెషల్ టీమ్‌ను రప్పించారు. ఆ తోటలో నివసిస్తు వారిని అప్రమత్తం చేసి వారి చేత ఇళ్లు ఖాళీ చేయించారు. అనంతరం ఆ ఎలుగుబంటిని ప్రాణాలతో పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.