Covid in Puducherry: పుదుచ్చేరిలో ఇద్దరు మంత్రులకు కరోనా, వారితో తిరిగిన వారు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని కోరిన సీఎం నారాయణ స్వామి, అక్కడ 5,624కు చేరిన మొత్తం కేసుల సంఖ్య
అక్కడ రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా పుదుచ్చేరి క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులు (Puducherry cabinet ministers) కందస్వామి, కమల కన్నన్ కరోనా మహమ్మారి బారినపడ్డారని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణసామి ప్రకటించారు. దాంతో వారిద్దరూ క్వారెంటైన్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.
Puducherry, August 11: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ కరోనా వైరస్ (Covid in Puducherry) క్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా పుదుచ్చేరి క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులు (Puducherry cabinet ministers) కందస్వామి, కమల కన్నన్ కరోనా మహమ్మారి బారినపడ్డారని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణసామి ప్రకటించారు. దాంతో వారిద్దరూ క్వారెంటైన్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.
ఆ మంత్రులిద్దరూ తమ విధి నిర్వహణలో భాగంగా ప్రజల మధ్య తిరిగారని, పలువురు అధికారులతో వారు కలిసి పనిచేశారని, అందువల్ల ఆ మంత్రులతో సన్నిహితంగా మెలిగిన ప్రజలు, అధికారులు పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికి వారు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణసామి (CM V Narayanasamy) ట్విట్టర్‌లో కోరారు. కరోనా సోకిన మంత్రులిద్దరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Here's CM Tweet
పుడుచేర్రిలో సోమవారం మరో 245 మందికి వైరస్ సోకింది. పుదుచ్చేరిలో 192 మంది, కారైకాల్‌లో ఆరుగురు, యానాంలో 47మంది ఉన్నారు. మొత్తం కేసుల సంఖ్య 5,624కి చేరింది. ఇప్పటివరకు 3,355 మంది కోలుకోగా.. 2,180 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 89కి చేరింది. దేశంలో తాజాగా 53,601 కరోనా కేసులు నమోదు, 22 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసులు, గత 24 గంటల్లో 871 మరణాలు, ఇప్పటివరకు కోవిడ్-19తో 45,257 మంది మృతి
భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు (India's Coronavirus) నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19 Tally) 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి (Death Toll Mounts to 45,257) చెందారు. గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారంవిడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.