Auto-Rickshaw Fare: ఆటో ప్రయాణానికి రూ. 4300 ఛార్జ్. గిర్రున తిరిగిన ఆటో మీటర్ రీడింగ్, ఖంగుతిన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆటో డైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఇదేంటని ఆటో డ్రైవర్ ను ప్రశ్నిస్తే సిటీ బయట నుంచి లోపలికి రావడానికి తాము రూ. 600 టోల్ చెల్లించామని...
Pune, September 19: సిటీకి ఎవరైనా కొత్తగా ఎంటర్ అయి అమాయకంగా కనిపిస్తే ఆటో వాలాలు ఎలా దోచుకుంటారో చెప్పటానికి ఇదొక ఉదాహారణ. కొత్త కంపెనీలో చేరడానికి పూణే చేరుకున్న బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) ను ఒక ఆటో-రిక్షా డ్రైవర్ 18 కిలోమీటర్ల దూరానికి రూ .4300 వసూలు చేశాడు.
వివరాలలోకి వెళ్తే, బెంగుళూరు నుంచి బస్సులో ప్రయాణమైన ఒక టెక్కీ బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు పుణెలోని కత్రాజ్-దేహు బైపాస్ వద్ద దిగాడు. అక్కడ్నించి పుణెలోని యెరావాడ ప్రాంతంలో ఉన్న అతడి కంపెనీ గెస్ట్ హౌజ్ కు వెళ్లాల్సి ఉంది. అయితే అతడు దిగిన ప్రాంతంలో క్యాబ్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ రోడ్డు గుండా వెళ్తున్న ఒక ఆటోను పిలిచి తాను చెప్పిన అడ్రెస్ కు తీసుకు వెళ్లాల్సిందిగా కోరాడు. ఆటోలో తనతో పాటు వెనక సీట్లో మరో వ్యక్తి కూడా కూర్చున్నాడు అతడు కూడా ఆటో డ్రైవరే, తాగి ఉన్నాడు, దీంతో మరో వ్యక్తి ఆటో నడిపాడని టెక్కీ వివరించాడు.
ఇక గమ్యస్థానానికి చేరిన తర్వాత రూ .4300 మీటర్ (Auto-Rickshaw Fare) అయిందని చెప్పడంతో ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఖంగుతిన్నాడు. ఇదేంటని ఆటో డ్రైవర్ ను ప్రశ్నిస్తే సిటీ బయట నుంచి లోపలికి రావడానికి తాము రూ. 600 టోల్ చెల్లించామని, తిరిగి వెళ్లేటపుడు కూడా మళ్ళీ రూ. 600 చెల్లించాల్సి వస్తుందని కాబట్టి ఈ 1200 రూపాయలు టోల్ ఛార్జీలు కాగా, మిగతాది మీటర్ రీడింగ్ అని ఆ ఇద్దరు టెకీతో అన్నారు. అయినప్పటికీ ఇంతెలా అవుతుందని వారితో వారించగా, ఆ ఆటో డ్రైవర్లు ఇద్దరూ తనను దబాయించారని రూ. 4300 చెల్లించకపోతే వదిలిపెట్టడంతో చేసేదేం లేక ఆ టెక్కీ వారు చెప్పినంతా చెల్లించాడు. ఇదీ చదవండి: చలాన్ల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయం తీసుకొవచ్చు
అనంతరం అతడు ప్రయాణించిన ఆటో నంబర్ నమోదు చేసుకొని యెరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు జరిగినదంతా వివరించాడు తాను నిద్రమత్తులో ఉన్నందున ఆటో మీటర్ రీడింగ్ ను గమనించలేదని తెలిపాడు. దీంతో టెక్కీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆటో డ్రైవర్ల సంగతి తేల్చడానికి వారి ఏరియాకు చెందిన పోలీసులను పంపారు.