Big Discount On Hyundai Verna

Mumbai, FEB 07: అద్భుతమైన ఫీచర్లతో నిండిన హ్యుందాయ్‌ వెర్నా (Hyundai Verna) మోడల్ కారు ఈ ఫిబ్రవరిలో ఏకంగా రూ. 75వేల వరకు తగ్గింపుతో వస్తోంది. వెర్నాలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్ (గరిష్ట శక్తి 115PS, 143.8Nm గరిష్ట టార్క్). 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ (గరిష్ట శక్తి 160PS, 253Nm గరిష్ట టార్క్). ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ (MT) కలిగి ఉన్నాయి. MPi యూనిట్ (IVT) ఆటోమేటిక్‌ ఆప్షన్ కూడా ఉంది. అయితే, టర్బో GDi యూనిట్‌ను 7-స్పీడ్ (DCT)తో పెయిర్ చేయవచ్చు. ఈ మిడ్-సైజ్ సెడాన్‌లో డార్క్ క్రోమ్ పారామెట్రిక్ గ్రిల్, హారిజన్ ఎల్ఈడీ పొజిషనింగ్ లాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ కనెక్ట్ చేసిన పారామెట్రిక్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MG Astor 2025 Launched: పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో మార్కెట్లోకి ఎంజీ అస్టర్‌, కేవలం రూ.9.99 లక్షలకే ప్రారంభం 

క్యాబిన్ విషయానికి వస్తే.. లోపల మాత్రం పవర్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సైడ్ హీట్, వెంటిలేటెడ్ సీట్లు, ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోలర్ కోసం స్విచింగ్ డిజిటల్ ప్యానెల్, 10.25-అంగుళాల హెచ్‌డీ ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్, కలర్ (TFT MID)తో డిజిటల్ క్లస్టర్, బోస్ ప్రీమియం సౌండ్ 8 స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 64 యాంబియంట్ లైట్ సిస్టమ్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Ola Gen 3 Electric Scooter: ఓలా నుంచి మరో మూడు కొత్త స్కూటర్లు, జనరేషన్‌ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ 

బ్లూలింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో, కొనుగోలుదారులు 65 కన్నా ఎక్కువ ఫీచర్లను పొందవచ్చు. 118 ఎంబెడెడ్ వాయిస్ కమాండ్‌లు కూడా ఉన్నాయి. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఈబీడీ(EBD)తో ఏబీఎస్ (ABS), హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, (ISOFIX), లేన్ చేంజ్ ఇండికేటర్, థెప్టింగ్ అలారం, బ్యాక్ పార్కింగ్ సెన్సార్‌తో సహా 30 ప్రామాణిక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

ఈ వాహనం మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. అందులో EX, S, SX, SX(O), S(O) టర్బో, SX టర్బో, SX(O) టర్బో ఉన్నాయి. ఈ హ్యుందాయ్ వెర్నా మోడల్ ప్రారంభ ధర రూ. 11,07,400 నుంచి ప్రారంభమై రూ. 17,54,800 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.