![](https://test1.latestly.com/uploads/images/2025/02/119-157.jpg?width=380&height=214)
Mumbai, FEB 06: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశీయ మార్కెట్‌లో ఎంజీ ఆస్టర్- 2025 (MG Aster- 2025) కారును ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో వస్తున్న తొలి కారు. షైన్ (Shine), సెలెక్ట్ (Select) వేరియంట్లలో కొత్త ఫీచర్లతో ఎంజీ ఆస్టర్ – 2025 (MG Aster- 2025) తీసుకొచ్చింది. షైన్ (Shine) వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్, సిక్స్ స్పీకర్లతో వస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తున్న ఎంజీ ఆస్టర్ షైన్ (MG Aster Shine) రూ.12.5 లక్షల్లోపు ధరకే అందుబాటులో ఉంటుంది. సెలెక్ట్ (Select) వేరియంట్ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీమియం ఐవరీ లెదరట్టే సీట్లతోపాటు సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లతో వస్తోంది. – ఎంజీ ఆస్టర్- 2025 (MG Aster- 2025) కారు స్ప్రింట్ (Sprint), షైన్(Shine), సెలెక్ట్(Select), షార్ప్ ప్రో (Sharp Pro),శావీ ప్రో (Savvy Pro) వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
ఎంజీ ఆస్టర్ 2025 (MG Astor-2025) కారు 14 అటానమస్ లెవల్ 2 ఫీచర్లు, మిడ్ రేంజ్ రాడార్లు, మల్టీ పర్పస్ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఫీచర్లతో వస్తోంది. 50కి పైగా ఫీచర్లతో సేఫ్టీకి టాప్ ప్రియారిటీ ఇస్తోంది. ఇంటిరీయర్‌గా ప్రీమియం పనోరమిక్ సన్‌రూఫ్‌తో డ్రైవింగ్‌కు కంఫర్ట్‌గా ఉంటుంది. ఎంజీ ఆస్టర్ – 2025 (MG Astor-2025) మూడు పవర్ ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్‌గా ఉండేందుకు 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 1.5 లీటర్ల సీవీటీ, 1.3 టర్బో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది.
ఎంజీ ఆస్టర్ -2025 (MG Astor 2025) కారు కన్వీనియస్, సెక్యూరిటీని పెంపొందించే పలు ఇన్నోవేటివ్ ఫీచర్లతో రూపుదిద్దుకుంది. ఫ్రంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ చార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ద్వారా నిరంతరాయ కనెక్టివిటీ ఉంటుంది.
సహజ సిద్ధమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, సేఫ్టీ కోసం ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం (auto-dimming IRVM)తోపాటు అప్‌గ్రేడెడ్ ఐ-స్మార్ట్ 2.0 సిస్టమ్(i-SMART 2.0 system) తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ ఆస్టర్ -2025 (MG Astor- 2025) కారు వాతావరణం, క్రికెట్‌లకు సంబంధించి రియల్‌టైం సమాచారం తెలుసుకునేందుకు జియో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ (JIO Voice Recognition system)తోపాటు 80కిపైగా కనెక్టెడ్ ఫీచర్లతో వస్తుంది. సెక్యూరిటీ కోసం యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్, డిజిటల్ కీ తదితర ఫీచర్లు ఉంటాయి.
ఎంజీ ఆస్టర్ 2025 (2025 MG Astor) కారు బేస్ వేరియంట్ ట్రిమ్ రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాప్ రేంజ్ శావీ ప్రో (Savvy Pro) కారు ధర రూ. 17.55 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
ఆస్టర్ స్ప్రింట్ ఎంటీ: రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ షైన్ ఎంటీ: రూ. 12.47 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ సెలెక్ట్ ఎంటీ: రూ. 13.81 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ సెలెక్ట్ సీవీటీ : రూ. 14.84 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ శార్ప్ ప్రో ఎంటీ: రూ. 15.20 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ శార్ప్ ప్రో సీవీటీ : రూ. 16.48 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ శావీ ప్రో (ఐవోరీ): రూ. 17.45 లక్షలు (ఎక్స్ షోరూమ్)
ఆస్టర్ శావీ ప్రో (సంగారియా రెడ్): రూ. 17.55 లక్షలు (ఎక్స్ షోరూమ్)