Puneeth Rajkumar funeral: అశ్రునయనాల మధ్య పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు, కన్నీరు మున్నీరైన సీఎం బొమ్మై

లక్షలాది మంది అశ్రునయనాలు.. కుటుంబ సభ్యుల రోదనల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

Puneeth Rajkumar Dies

Bangalore, October 31: కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. లక్షలాది మంది అశ్రునయనాలు.. కుటుంబ సభ్యుల రోదనల మధ్య.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌ లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడియూరప్పతో, సిద్దరామయ్య పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు.

అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు నిల్చుండిపోయారు. మరోసారి పునీతుడి తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థివదేహానికి నమస్కరించారు.

 

భార్య అశ్వినీ రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్.. పార్థివదేహం వద్దే కొద్దిసేపు కూర్చున్నారు. కడసారి వీడ్కోలు పలికారు. ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా ఛాతిలో నొప్పితో కుప్పకూలారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించారు.

చిన్న వయస్సులోనే పునీత్ కన్నుమూయడంతో ఆ వార్త విన్న అభిమానుల గుండె పగిలింది. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేపోయారు. మూడు రోజులుగా కంఠీరవ స్టేడియంలో అభిమానుల రోదనలు మిన్నంటాయి.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif