Coronavirus Pandemic: పటియాలా జైల్లో 40 మంది మహిళా ఖైదీలకు కరోనా, ఉత్తరాఖండ్ తాజ్‌లో 76 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనావైరస్ విలయతాండవం
దీంతో ఆ జైలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది. వీరిందరిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స(40 women in Patiala's New Nabha jail test positive) అందిస్తున్నారు. అయితే నెగిటివ్ వచ్చిన ఖైదీలకు త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Punjab, Mar 30: పంజాబ్ పటియాలాలోని నభా ఓపెన్ జైల్లో 40 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ (Coronavirus Pandemic) నిర్ధారణ అయింది. దీంతో ఆ జైలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది. వీరిందరిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స(40 women in Patiala's New Nabha jail test positive) అందిస్తున్నారు. అయితే నెగిటివ్ వచ్చిన ఖైదీలకు త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో పంజాబ్‌లో కొత్తగా 2,914 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59 మంది చనిపోయారు. దీంతో పంజాబ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,34,602కు చేరింది. నిన్న ఒక్కరోజే జలంధర్‌లో 13 మంది, లుధియానాలో 11 మంది, హోషియాపూర్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పంజాబ్‌లో కరోనాతో 6,749 మంది చనిపోయారు.
ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్ నగరంలోని తాజ్ ఐదు నక్షత్రాల హోటల్ లో 76 మందికి కరోనా సోకింది. దీంతో తెహ్రీ గర్హ్వాల్ అధికారులు హోటల్ తాజ్ ను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.కరోనా కేసులు వెలుగుచూసిన హోటల్ తాజ్ ను శానిటైజ్ చేయించి ముందుజాగ్రత్తగా తాత్కాలికంగా మూసివేశామని తెహ్రీ గర్హ్వాల్ ఎస్పీ తృప్తి భట్ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1660 కరోనా కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో మొత్తం 96,512 కరోనా కేసులు నమోదు కాగా, 1709 మంది మరణించారు.
కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56,211 కొత్త కేసులు నమోదు కాగా, అందులో 78.56 శాతం కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలోనే బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడిన 56,211 మంది బాధితుల్లో మహారాష్ట్రకు చెందిన వారు 31,643 మంది, పంజాబ్‌కు చెందిన వారు 2,868 మంది, కర్ణాటకకు చెందిన వారు 2,792 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు 2,323 మంది, తమిళనాడుకు చెందిన వారు 2,279 మంది, గుజరాత్‌కు చెందిన వారు 2,252 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.