Raah Group Foundation: నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు, ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు రివార్డును ప్రకటించిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌, చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ ప్రకటనపై నెటిజన్ల ప్రశంసల వర్షం

జాతీయ నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతలు, సెలబ్రిటీలు అందరూ తెలంగాణ పోలీసుల(Hyderabad Police)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హరియాణాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డును కూడా ప్రకటించింది.

Raah Group Foundation Chairman Naresh Selpar (Photo-ANI)

Hyderabad, December 6: దిషా కేసు(Disha murder case)లో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ (Hyderabad Encounter) చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతలు, సెలబ్రిటీలు అందరూ తెలంగాణ పోలీసుల(Hyderabad Police)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హరియాణాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డును కూడా ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌ (Raah Group Foundation) చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ (Chairman Naresh Selpar) దిషా కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు భారీ రివార్డు అందజేయనున్నట్టు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు తమ కంపెనీ తరపున రూ. లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పుడు రాహ్‌ గ్రూప్‌ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ANI Tweet

కాగా, దిషాపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. దిషాను కాల్చివేసిన ప్రదేశంలో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులపైకి రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతిచెందారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif