Rafale Fighters Land in India: భారత్‌కు చేరుకున్న రాఫెల్ యుధ్ధ విమానాలు, ఫ్రాన్స్ నుండి 7,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్న ఫైటర్స్
ఫ్రాన్స్ నుండి 7,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేసిన తరువాత హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి (Ambala Airbase) రాఫెల్ జెట్ ఫైటర్స్ చేరుకున్నాయి. ఈ ప్రయాణంలో యుఎఇలో మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ మరియు రాత్రిపూట పిట్ స్టాప్ వంటివి ఉన్నాయి సింగిల్ సీట్ కలిగిన జెట్స్ మూడు.. రెండు జంట-సీట్ల ఓమ్ని-రోల్ ఫైటర్స్ రెండు ఫైటర్స్ ఇండియాలో అడుగుపెట్టాయి. కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ హర్కిరాత్ సింగ్ నేతృత్వంలోని ఏడుగురు IAF పైలట్లు ఈ విమానాలను (Five new Rafale jets land in India) ఇండియాకు తీసుకువచ్చారు.
Ambala. July 29: యావధ్భారతం ఉత్కంతతో ఎదురుచూస్తున్న రాఫెల్ యుధ్ధ విమానాలు ఎట్టకేలకు బుధవారం భారతదేశానికి (Rafale Fighter Jets Land in India) చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుండి 7,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేసిన తరువాత హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి (Ambala Airbase) రాఫెల్ జెట్ ఫైటర్స్ చేరుకున్నాయి. ఈ ప్రయాణంలో యుఎఇలో మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ మరియు రాత్రిపూట పిట్ స్టాప్ వంటివి ఉన్నాయి. అదుర్స్ అనిపించేలా రాఫెల్ జెట్స్ ఎంట్రీ వీడియో, సుఖోయ్ ఫైటర్స్‌ని తోడు తీసుకుని వస్తున్నరాఫెల్ యుద్ధ విమానాలు
సింగిల్ సీట్ కలిగిన జెట్స్ మూడు.. జంట-సీట్ల ఓమ్ని-రోల్ ఫైటర్స్ రెండు ఫైటర్స్ ఇండియాలో అడుగుపెట్టాయి. కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ హర్కిరాత్ సింగ్ నేతృత్వంలోని ఏడుగురు IAF పైలట్లు ఈ విమానాలను (Five new Rafale jets land in India) ఇండియాకు తీసుకువచ్చారు. కాగా ఆకాశంలో రాఫెల్ జెట్లు చక్కర్లు కొడుతున్న వీడియోను Defence Minister’s office (RMO) షేర్ చేసింది.
ఈ వీడియోలో భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్ విమానాలకు రక్షణగా రెండు సుఖోయ్(SU30 MKI) జెట్స్ తోడుగా ఉన్నాయి. ఇవి ముంబై మీదుగా అంబాలా ఎయిర్‌బేస్‌కు వచ్చాయి. శుత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధవిమానాల్లో ప్రస్తుతం ఐదు యుద్ధవిమానాలు అంబాలా చేరుకున్నాయి.
చైనా స్వయంగా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20, చైనాలో తయారై పాక్ వాయుసేనకు చేరిన జేఎఫ్-17తో పోలిస్తే రాఫెల్ పలు విషయాల్లో మెరుగైనదని సైనిక నిపుణులు చెబుతున్నారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఈ విమానాలను లఢఖ్ సెక్టార్‌లో మోహరించనున్నారు.
ఈ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు వీటిని తోడుకుని వస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాగా నిన్న 30 వేల అడుగుల ఎత్తులో ఓ ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా అంబాలా వైమానిక స్థావరం వద్ద భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదూరియా కొత్త విమానాలను స్వీకరించారు. గత రెండు దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం అందుకుంటున్న తొలి కీలక అస్త్రం రాఫెల్ యుద్ధ విమానమే కావడం విశేషం. పాక్, చైనా కవ్వింపుల నేపథ్యంలో ఇది గేమ్ ఛేంజర్ కాగలదని రక్షణశాఖ నిపుణులు భావిస్తున్నారు.