Ambala. July 29: ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మరికాసేపట్లో హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌లో దిగనున్నాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి భారత్ చేరుకున్నాయి. ఇందులో రెండు శిక్షణ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. మార్గమధ్యలో యూఏఈలో అల్‌దఫ్రా ఎయిర్‌బేస్‌లో ఇవి ఇంధనం నింపుకున్నాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రాఫెల్ జెట్ల వీడియోను Defence Minister’s office (RMO) షేర్ చేసింది. రాఫెల్‌కు వాటర్ సెల్యూట్, అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ కానున్న రాఫెల్ యుద్ధ విమానాలు, రిసీవ్ చేసుకునేందుకు అంబాలా చేరుకున్న వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా
ఈ వీడియోలో భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్ విమానాలకు రక్షణగా రెండు సుఖోయ్(SU30 MKI) జెట్స్ తోడుగా ఉన్నాయి. ఇవి ముంబై మీదుగా అంబాలా ఎయిర్‌బేస్‌కు వస్తున్నాయి. శుత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధవిమానాల్లో ప్రస్తుతం ఐదు యుద్ధవిమానాలు అంబాలా చేరుకోనున్నాయి. ఈ రోజు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ (Ambala airbase) వద్ద రాఫెల్ ల్యాండ్ అయిన తరువాత ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు 'వాటర్ సెల్యూట్' (Water Salute ) ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎయిర్‌బేస్‌లో వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా నిర్వహించనున్నారు. వీటిని రిసీవ్ చేసుకోవడానికి వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా (IAF chief Air Chief Marshal RKS Bhadauria) అంబాలాలో ఉన్నారు.
Video of Rafale Jets Entering the Indian Airspace:
The five Rafales escorted by 02 SU30 MKIs as they enter the Indian air space.@IAF_MCC pic.twitter.com/djpt16OqVd
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 29, 2020
చైనా స్వయంగా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20, చైనాలో తయారై పాక్ వాయుసేనకు చేరిన జేఎఫ్-17తో పోలిస్తే రాఫెల్ పలు విషయాల్లో మెరుగైనదని సైనిక నిపుణులు చెబుతున్నారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఈ విమానాలను లఢఖ్ సెక్టార్‌లో మోహరించనున్నారు.