Raigad Building Collapse Update: ఇద్దరు మృతి, శిధిలాల కింద మరో 18 మంది, మహారాష్ట్రలో కూలిన ఐదు అంతస్తుల భవనం

అయితే భవన శిథిలాల కింద సుమారు 90 మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలు ( NDRF teams) రెస్క్యూ నిర్వహిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. ఇంకా శిథిలాల కింద 18వరకు ఉంటారని భావిస్తున్నట్లు రాయ్‌ఘడ్ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు.

Raigad Building Collapse (Photo Credits: ANI)

Mumbai, August 25: మహారాష్ట్ర (Maharashtra) లో రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురా ( kajalpura ) లో ఐదు అంతస్తుల భవనం ( building collapsed) కుప్పకూలింది. అయితే భవన శిథిలాల కింద సుమారు 90 మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలు ( NDRF teams) రెస్క్యూ నిర్వహిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. ఇంకా శిథిలాల కింద 18వరకు ఉంటారని భావిస్తున్నట్లు రాయ్‌ఘడ్ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు.

ఇప్పటివరకు శిథిలాల కింద (Raigad Building Collapse Update) చిక్కుకున్న 60 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు మంత్రి అదితి తట్కరే వెల్లడించారు. ఈ ఘటనలో 17మంది వరకు గాయపడ్డారని .. వారందరినీ సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. సహాయక చర్యలు వేగంగా చేపడుతన్నామని, ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు

హుటాహుటిన మూడు ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం) బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 60 మందినిపైగా రక్షించారు. సహాయక చర్యలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం, 15 మందికి గాయాలు.. శిథిలాల కింద మరో 70 మంది? కొనసాగుతున్న సహాయక చర్యలు

భవనం కూలిపోవడం విషాదకరం. సహాయ చర్యలను చేపట్టేందుకు మరింత మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపుతున్నాం. వీలైనంత త్వరగా శిథిలాల కింద ఉన్న వారందరినీ రక్షిస్తాం. అందరి భద్రత కోసం ప్రార్థిస్తున్న' అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ప్రత్యేక పరికరాలతో సహాయక చర్యలు చేపట్టేందుకు పూణే నుంచి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాం. ఎన్డీఆర్ఎఫ్ మహారాష్ట్ర కమాండెంట్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు’ అని ఎన్డీఆర్ఎఫ్‌ డీజీ సత్యనారాయణ ప్రధాన్‌ ట్విట్‌ చేశారు.

తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ముంబై త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒక‌రు మరణించినట్లు స‌మాచారం. కాగా ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం కాజల్‌పురా ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో 40 నుంచి 45 కుటుంబాలు ఉంటున్నాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు.