Raigad Road Accident: రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తా పడిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, 5 మంది మృతి, 27 మందికి గాయాలు
రాయ్‌గఢ్ జిల్లాలోని తమ్హిని ఘాట్ సెక్షన్‌లో శుక్రవారం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 27 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
రాయ్‌గఢ్, డిసెంబర్ 20 : రాయ్‌గఢ్ జిల్లాలోని తమ్హిని ఘాట్ సెక్షన్‌లో శుక్రవారం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 27 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పర్పుల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు, పూణె జిల్లాలోని లోహెగావ్ నుండి మహద్ (రాయ్‌గఢ్)లోని బిర్వాడి గ్రామానికి ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న వ్యక్తులను తీసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
బాధితుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు, గాయపడిన వారిని మాన్‌గావ్ గ్రామీణ ఆసుపత్రి, రాయ్‌గఢ్‌లోని ఇతర మెడికేర్ సెంటర్లకు తరలించారు. మృతుల్లో సంగీత ధనంజయ్ జాదవ్, వందనా జాదవ్, శిల్పా ప్రదీప్ పవార్, గౌరవ్ అశోక్ దారాడే, జాదవ్ వంశానికి చెందిన వివాహ బృందంలో భాగమైన మరో గుర్తుతెలియని వ్యక్తి ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ఘాట్ సెక్షన్లలో లోహెగావ్ నుండి బీర్వాడికి వేగంగా వెళుతోంది, అయితే హైవే వంకర టింకర్లుగా ఉండటంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
Raigad Road Accident
ఈ నేపథ్యంలోనే అదుపుతప్పి వాలుగా ఉన్న మార్గంలో పక్కకు పడిపోయింది. స్ఠానికులు అక్కడుకు చేరుకుని మంగావ్ పోలీసులకు సమాచారం అందించారు.వారు రెస్క్యూ టీమ్‌లు మరియు వైద్య సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చాలా మంది గాయపడిన బాధితులు బస్సులో చిక్కుకుపోయారని, వారిని రక్షకులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, వారిలో ఐదుగురు ప్రమాదంలో తక్షణమే మరణించారని మంగావ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.