Protest on New Pension Scheme: మే 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె, ఆగిపోనున్న రైళ్లు, కేంద్రం తీసుకువచ్చిన నూతన పెన్సన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్
ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు (Railway Employees and Workers) పోస్టల్, టెలికం, ఇన్‌కమ్‌టాక్స్, డిఫెన్స్, డీఆర్‌డీవో లాంటి కీలకమైక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ (New Pension Scheme Not Implemented) దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నారు.
New Delhi, Mar 1: కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి సమ్మెకు(Protest on New Pension Scheme) పిలుపునిచ్చారు. ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు (Railway Employees and Workers) పోస్టల్, టెలికం, ఇన్‌కమ్‌టాక్స్, డిఫెన్స్, డీఆర్‌డీవో లాంటి కీలకమైక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ (New Pension Scheme Not Implemented) దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నారు. మార్చి 19న అన్ని ప్రభుత్వ రంగాల, సంస్థల శాఖాధిపతులకు సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది సమ్మెలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో దాదాపు 24 లక్షల మంది నూతన పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చారు. దీంతో వీరంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెబాట పట్టనున్నారు. ఈ సమ్మెకు రైల్వేలు, పోస్టల్, టెలికం, ఐటీ, డిఫెన్స్ శాఖలలో ఉన్న ఉద్యోగులంతా మద్దతు ఇవ్వబోతున్నారు. ఎస్‌సీఆర్ మజ్దూర్ యూనియన్‌తో పాటు ఎస్‌సీఆర్ ఎంప్లాయిస్ సంఘ్, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా సమ్మెకు మద్దతు తెలిపాయి.