Rajasthan Accident: హైవేపై ఆగిపోయిన బస్సు, రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన ట్రక్కు, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం, 11 మంది మృతి
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు. (Jaipur-Agra National Highway) గుజరాత్ నుంచి మధుర వెళ్తున్న ప్యాసింజర్ బస్సు చెడిపోవడంతో హైవే పక్కనే నిలిపారు.
Agra, SEP 13: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు. (Jaipur-Agra National Highway) గుజరాత్ నుంచి మధుర వెళ్తున్న ప్యాసింజర్ బస్సు చెడిపోవడంతో హైవే పక్కనే నిలిపారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలో జీపు బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్‌గఢ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖోవాలీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నంద్రం జాట్ (70), నీతూ జాట్ (60), దీపు జాట్ (13), అర్జున్ జాట్ (40)గా గుర్తించారు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.