Rajasthan Road Mishap: ఘోర ప్రమాదం..రక్తసిక్తమైన రహదారి, ఎనిమిది మంది మృతి, రాజస్థాన్‌లో ప్రముఖ ఆలయం ఖాటూశ్యామ్ జీ దర్శనం చేసుకుని వస్తుండగా విషాద ఘటన
రహదారి రక్త సిక్తమైంది. జైపూర్ సమీపంలో టోంక్ జిల్లాలో ఓ జీపును ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు నేషనల్ హైవే 12పై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది (Rajasthan Road Mishap) చనిపోయారు.
Jaipur, Jan 27: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి రక్త సిక్తమైంది. జైపూర్ సమీపంలో టోంక్ జిల్లాలో ఓ జీపును ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు నేషనల్ హైవే 12పై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది (Rajasthan Road Mishap) చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని జైపూర్ లోని ఆస్పత్రికి తరలించామని, యాక్సిడెంట్ చేసిన ట్రక్కు డ్రైవర్, యాక్సిడెంట్ కు గురైన జీపు డ్రైవరూ పరారయ్యారని టోంక్ డీసీపీ తెలిపారు. జీపులో ప్రయాణిస్తున్న వారిది మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ అని చెప్పారు.
రాజ్‌గఢ్ ప్రాంతానికి చెందిన వీరు రాజస్థాన్‌లోని ప్రముఖ ఆలయం ఖాటూశ్యామ్ జీ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న జీపును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Gehlot) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోంక్ రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారని తెలిసి చాలా బాధేసిందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Here's ANI Update
ఇటీవలి కాలంలో రాజస్తాన్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్‌లో రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ, క్రూజర్ వాహనాలు రెండూ ఎదురెదురుగా ఢికొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం.. మధ్యప్రదేశ్‌లో ఓ శుభ కార్యక్రమానికి హాజరై క్రూజర్‌లో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చిత్తౌడ్‌గఢ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం విచారం వ్యక్తంచేశారు.