Death of Dalit Boy: ముగిసిన దళిత విద్యార్థి అంత్యక్రియలు, పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్తులు, టీచర్ కుండలొ నీళ్లు తాగాడని బాలుడిని కొట్టి చంపిన టీచర్

తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్‌ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడని ఆ బాలుడిని టీచర్‌ చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ (Death of Dalit Boy) మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చోటుచేసుకుంది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Jodhpur, August 15: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకున్న సంగతి విదితమే. తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్‌ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడని ఆ బాలుడిని టీచర్‌ చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ (Death of Dalit Boy) మరణించాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చోటుచేసుకుంది. ఆందోళనల మధ్య ఆ బాలుడి అంత్యక్రియలు (Class 3 Dalit Student Indra Meghwal) ముగిసాయి. గ్రామంలోని కొందరు వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పోలీసులు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వి తమ నిరసనను తెలియజేశారు.

దొంగతనం నెపంతో 9ఏళ్ల బాలుడ్ని చితకబాదిన పోలీసులు, మధ్యప్రదేశ్‌లో దారుణం, ఆపేందుకు వచ్చినవారితో కూడా దురుసుగా ప్రవర్తించిన ఖాకీలు

బాలుడి మృతిని కొన్ని రాజకీయపార్టీలు తమకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు యజమానిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేయగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి రాష్ట్రంలొ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసలు ఘటన ఏంటీ ?

రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్‌ సింగ్‌ అనే టీచర్‌ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్‌ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టీచర్‌ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్‌ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆదేశించారు. టీచర్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ చెప్పారు.

మృతి చెందిన బాలుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. దీంతో పాటు SC/ST రూల్స్ కింద రూ. 8 లక్షల పరిహారాన్ని కూడా బాలుని కుటుంబానికి ప్రకటించారు. వచ్చే వారం ఈ మొత్తాన్ని మృతి చెందిన బాలుని కుటుంబానికి జిల్లా ఎస్ పీ ప్రకటించారు.



సంబంధిత వార్తలు