Bhopal, AUG 14: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో (Jabalpur) సైకిల్‌ను దొంగిలించాడనే అనుమానంతో తొమ్మిదేళ్ల బాలుడిని పోలీస్ కానిస్టేబుల్ (Police), మరో వ్యక్తి కలిసి దారుణంగా కొట్టారు. నివాస ప్రాంతంలోని ఓ వీధిలో బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని క్రూరంగా చితకబాదారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సీసీ టీవీలో ఈ ఘటన రికార్డ్ అయింది. అయితే బాలుడిపై దాడి చేసిన (beating nine-year-old boy) వారిలో స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (ఎస్‌ఏఎఫ్) 6వ బెటాలియన్‌కు చెందిన అశోక్ థాపా అనే కానిస్టేబుల్ ఉన్నాడని గుర్తించామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్దార్థ్ బహుగుణ తెలిపారు. ఈ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. బైక్‌పై ఉన్న వ్యక్తి తొమ్మిదేళ్ల బాలుడిని (beating nine-year-old boy) పట్టుకుని ఉన్నాడు. తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తి పిల్లవాడిని దారుణంగా కొట్టడం వీడియోలో కనిపించింది. అయితే అక్కడే ఉన్న మరోవ్యక్తి పిల్లవాడిని జుట్టు పట్టుకుని కనికరం లేకుండా కొట్టారు.
A nine-year-old boy, cornered on a street in a residential area, is wildly thrashed by men on bikes, including a policeman in civilian clothes, for allegedly stealing a bicycle in Jabalpur, @ndtv @ndtvindia pic.twitter.com/5P5aqLcI1v
— Anurag Dwary (@Anurag_Dwary) August 13, 2022
ఈ సమయంలో స్థానికంగా ఉన్న వ్యక్తి జోక్యం చేసుకొని బాలుడిపై దాడి చేయకుండా ఆపేందుకు యత్నించాడు. కానీ ఆ వ్యక్తి ని సైతం వారు దూరంగా నెట్టేశారు. మహిళ కూడా వారిని ఆపడానికి ప్రయత్నించింది. తీవ్రంగా కొట్టి బాలుడ్ని తన బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లడం వీడియోలో కనిపించింది.
అయితే ఈ ఘటనపై రాంఝీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, తదుపరి చర్య కోసం కానిస్టేబుల్‌కు నోటీసు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని దారుణంగా కొట్టిన కానిస్టేబుల్ పై పలురకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జబల్పూర్ ఎస్ఎస్‌పీ ప్రదీప్ పాండే అన్నారు