Rajasthan: గదిలో ప్రియురాలితో లవర్.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె భర్త, భయంతో ఐదవ అంతస్తు నుండి కిందకు దూకిన ప్రియుడు, పరారీలో ప్రియురాలు, ఆమె భర్త, రాజస్థాన్ రాష్ట్రంలో ఘటన

తన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతున్న ప్రియుడు ఆమె భర్త వస్తున్నాడని తెలిసి ఇంటి బాల్కనీ నుంచి (Man Dies In Jaipur After Jumping) దూకేశాడు.

Representational Image (Photo Credits: ANI)

Jaipur, Dec 17: రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతున్న ప్రియుడు ఆమె భర్త వస్తున్నాడని తెలిసి ఇంటి బాల్కనీ నుంచి (Man Dies In Jaipur After Jumping) దూకేశాడు. 29 ఏళ్ల యువకుడు తన ప్రియురాలి భర్త చేతిలో చిక్కుకోకుండా ఉండటానికి భవనంలోని ఐదవ అంతస్తు నుండి (Man Jumps From 5th Floor) కిందకు దూకి మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహ్సిన్‌గా గుర్తించారు. మృతుడు వివాహితతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు.

ఆమెకు అప్ప‌టికే పెళ్ల‌యి, ఒక కుమార్తె కూడా ఉంది. అయినా స‌రే ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. త‌మ పెళ్లికి ఎవ‌రూ ఒప్పుకోర‌ని తెలిసి పారిపోయారు.రాజ‌స్థాన్ లోని జైపూర్ నగరంలో ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో అద్దెకు ఉంటున్నారు. ఆ యువ‌కుడి పేరు మోహ్‌సిన్. అత‌నితో ఉంట‌న్న యువ‌తి భ‌ర్త‌.. త‌న భార్య కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాడు. ఇలా వీళ్లు జైపూర్‌లో ఉన్న‌ట్లు అత‌నికి తెలిసింది. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని, ఇంట్లోకి వ‌చ్చాడు. ప్రియురాలి భ‌ర్త‌ను చూసిన మోహ్‌సిన్ భ‌యంతో వ‌ణికిపోయాడు. అత‌న్నుంచి త‌ప్పించుకునేందుకు (Escape Lover's Husband) ఐదో అంత‌స్తులోని ఫ్లాట్ నుంచి కింద‌కు దూకేశాడు.

భర్త శృంగారానికి పిలిచినందుకు.. నన్నే పిలుస్తావా అంటూ పురుషాంగాన్ని కత్తితో కోసేసిన భార్య, మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ఘడ్ పట్టణంలో దారుణం, నిందితురాలు అరెస్ట్

దీంతో షాకైన మోహ్‌సిన్ ప్రియురాలు అత‌న్ని స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స పొందుతూ మోహ్‌సిన్ మృతి చెందాడు. ఈ విష‌యం తెలిసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. మోహ్‌సిన్ ప్రియురాలు, ఆమె భ‌ర్త ప‌రారీలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మొహసిన్ మృతదేహాన్ని అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించామ‌ని, పరారీలో ఉన్న భార్యాభ‌ర్త‌ల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీర్ సింగ్ వివ‌రించారు.