Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, భక్తులతో వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ, 5 మంది5 అక్కడికక్కడే మృతి, మరో 25 మందికి గాయాలు
పాలి జిల్లాలోని సుమీర్‌పూర్‌లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ (Rajasthan Road Accident) ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలి జిల్లాలోని సుమీర్‌పూర్‌లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ (Rajasthan Road Accident) ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికు తరలించారు. బాధితులు జైసల్మేర్‌లోని రామ్‌దేవరా ఆలయాన్ని దర్శించుకుని తిరుగుపయాణమయ్యారని, ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఓ లారీ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రాజస్థాన్ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.