Anant Radhika Pre Wedding Celebrations: అంబానీ ఇంట పెళ్లి వేడుక‌ల్లో రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల సంద‌డి, జై శ్రీ‌రామ్ అంటూ నినాదాలు చేసిన ఫ్యాన్స్, చ‌ర‌ణ్ రియాక్ష‌న్ చూడండి!

ఈవెంట్ వేదిక లోపలికి వెళ్లేముందు మీడియాకు చరణ్ – ఉపాసన (Ram Charan Upasana) పోజులు ఇస్తుండగా అక్కడ మీడియా, అభిమానులు చరణ్ ని చూసిన ఆనందంతో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.

Ram Charan Upasana (PIC@ X)

Jamnagar, March 01: ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ (Ananth Ambani) త్వరలో రాధికని వివాహం చేసుకోబోతున్నాడు. దీంతో అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (Anant Radhika Pre Wedding Celebrations) గుజరాత్ జామ్‌నగర్ లో అంగరంగ వైభవంగా గత రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు వస్తున్నారు. వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్.. లాంటి ఎంతోమందో ఊహించని అతిధులు ఈ ఈవెంట్ కి నేడు హాజరయ్యారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటే మాములుగా ఉండదు మరి. అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది. ఈ వేడుకకు టాలీవుడ్ లో రామ్ చరణ్ కి ఆహ్వానం అందింది. దీంతో నేడు చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈవెంట్ వేదిక లోపలికి వెళ్లేముందు మీడియాకు చరణ్ – ఉపాసన (Ram Charan Upasana) పోజులు ఇస్తుండగా అక్కడ మీడియా, అభిమానులు చరణ్ ని చూసిన ఆనందంతో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.

 

చరణ్ వారికి నమస్కారం చేస్తూ లోపలి వెళ్లారు. చరణ్ కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపించారు. RRR సినిమాలో క్లైమాక్స్ లో రామ్ చరణ్ శ్రీ రాముడి లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో నార్త్ లో ఆ లుక్ బాగా వైరల్ అవ్వడం, చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం తెలిసిందే. ఇప్పుడు చరణ్ ని చూడగానే జై శ్రీరామ్ అని అక్కడి ప్రజలు అరుస్తున్న వీడియో వైరల్ గా మారింది.