Uttar Pradesh Shocker: రేప్ కేసులో అరెస్ట్ చేయించింద‌ని బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి బాధితురాలిని చంపిన వ్య‌క్తి, 17 ఏళ్ల మైన‌ర్ పై 20 ఏళ్ల యువకుడి అఘాయిత్యం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఘ‌ట‌న‌

బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (Rape Accused Shot Victim) ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శంభాల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Shot

Sambal, SEP 21: బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (Rape Accused Shot Victim) ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శంభాల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 ఏళ్ల రింకూ 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు.

Road Accident At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి..వీడియో ఇదిగో 

కాగా, అత్యాచార నిందితుడు రింకూ ఈ నెలలో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. సెప్టెంబర్‌ 18న రాత్రి వేళ తల్లితో కలిసి సోదరుడి బైక్‌పై వెళ్తున్న బాధిత యువతిని తన స్నేహితుడితో కలిసి అడ్డుకున్నాడు. ఆమెపై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రింకూ, అతడి అనుచరుడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif