Ravish Kumar Resigns: ఎన్టీటీవీకి మరో సీనియర్ జర్నలిస్ట్ రాజీనామా, యూట్యూబ్‌కు షిఫ్ట్ అయిన రవీష్ కుమార్, రెండున్నర దశాబ్దాల పాటూ ఎన్టీటీవీ గ్రూపుతో ప్రయాణించిన రవీష్
నివేదికల ప్రకారం.. న్యూస్ ఛానెల్ బుధవారం అంతర్గత కమ్యూనికేషన్ ద్వారా తన రాజీనామాను రవీష్ కుమార్ ప్రకటించినట్లు చెబుతున్నారు. రవీష్ కుమార్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చిందని ఎన్డీటీవీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు అంతర్గత మెయిల్‌లో ఛానెల్ పేర్కొంది.
New Delhi, DEC 01: ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ (NDTV) అదానీ గ్రూప్ చేతుల్లోకి (adani group) అధికారికంగా వెళ్లిపోయింది. దీంతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణయ్ రాయ్ (pranay roy), రాధిక రాయ్‌లు (Radhika Roy) తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు బోర్డు ఆమోదించిన ఒకరోజు తరువాత సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ (Ravish Kumar Resigns) కూడా రాజీనామా చేశారు. ఎన్డీటీవీ ఇండియాలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ పదవికి రవీష్ (Ravish Kumar) రాజీనామా చేసినట్లు ఎన్డీటీవీ వర్గాలు తెలిపాయి. నివేదికల ప్రకారం.. న్యూస్ ఛానెల్ బుధవారం అంతర్గత కమ్యూనికేషన్ ద్వారా తన రాజీనామాను రవీష్ కుమార్ ప్రకటించినట్లు చెబుతున్నారు. రవీష్ కుమార్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చిందని ఎన్డీటీవీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు అంతర్గత మెయిల్‌లో ఛానెల్ పేర్కొంది.
రవీష్ చాలామంది జర్నలిస్టులను, ప్రజలను ప్రభావితం చేశారు. భారతదేశంలో, అంతర్జాతీయంగా అతనికి లభించిన ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఎన్నో ఉన్నాయి. రవీష్ దశాబ్దాలుగా ఎన్డీటీవీలో అంతర్భాగంగా ఉన్నారు. అతని సహకారం అపారమైంది. రవీష్ కొత్త ప్రారంభాన్ని ప్రారంభించినప్పుడు విజయం సాధిస్తాడని మాకు తెలుసు అని మెయిల్ పేర్కొంది. ఇదిలాఉంటే రవీష్ కుమార్ 1996లో న్యూ ఢిల్లీ టెలివిజన్ నెట్‌వర్క్‌లో చేరారు. అప్పటి నుంచి ఛానల్‌తో కొనసాగుతున్నారు.
రవీష్ కుమార్ ఎన్డీటీవీ ఇండియాలో హమ్ లాగ్, రవీష్ కి రిపోర్ట్ (Ravish ki report), దేశ్ కీ బాత్ (Desh ki Baat), ప్రైమ్ టైమ్ (Prime time) వంటి అనేక వార్తల ఆధారిత షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కుమార్‌కు 2019లో రామన్ మెగసెసే అవార్డుతో పాటు రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు కూడా రెండుసార్లు లభించింది.