RBI: సోషల్ మీడియాలో రుణ మాఫీ ప్రచారాలపై ఆర్బీఐ హెచ్చరిక, రుణమాఫీ సర్టిఫికెట్‌లు ఇస్తామనే యాడ్‌లు నమ్మవద్దని సూచన
వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా విరివిగా జరుగుతున్న అనధికార రుణ మాఫీ ప్రచారాలపై ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరించింది. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపింది. రుణ మాఫీలకు (Loan Waiver) సంబంధించి తప్పు దోవ పట్టించేలా కొన్ని సంస్థలు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో కొన్ని యాడ్స్ (Fake Ads) ఇస్తున్నాయని, ఎలాంటి అధికారమూ లేకపోయినా ``రుణమాఫీ సర్టిఫికెట్``లను జారీ చేస్తామని చెప్పి సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం
ఇటీవలి కాలంలో రుణమాఫీ సర్టిఫికెట్‌లను జారీ చేస్తామమని చెప్పుకుంటూ కొన్ని సంస్థలు దేశంలోని పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు రుణాలను చెల్లించాల్సిన అవసరం లేదంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇలాంటి ప్రకటనలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, డిపాజిట్లరకు నష్టాన్ని కలిగిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. అలాగే అలాంటి ప్రకటనలు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలని సూచించింది.