Newdelhi, Oct 6: రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటులో (RBI- Repo Rate) ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దాస్ అధ్యక్షతన ఈ నెల 4-6 తేదీల్లో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC), కీలక రేట్లపై తీసుకున్న నిర్ణయాలను దాస్ వివరించారు. ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి.
Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..
#RBIPolicy | RBI’s Monetary Policy Committee decides to maintain status quo, #RepoRate is kept unchanged at 6.50% pic.twitter.com/wCh0lQ3YD7
— CNBC-TV18 (@CNBCTV18Live) October 6, 2023
తగ్గింపు అప్పుడేనా??
గత రెండు సంవత్సరాలుగా రెడ్ జోన్ లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కిందికి దించడానికి ప్రపంచంలోని ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా, భారత్‌లో CPI ద్రవ్యోల్బణం ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంది. జులైలోని గరిష్ట స్థాయి 7.4% నుంచి ఆగస్టులో 6.8%కు ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. అయితే, ఇప్పటికీ RBI టాలరెన్స్ అప్పర్ బ్యాండ్ 6% కంటే పైనే ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుతోంది కాబట్టి, 2025లో రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ ఊహిస్తోంది.
Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. 40 మందికి గాయాలు