YES Bank Crisis: యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు, కస్టమర్ల సొమ్ము ఎక్కడికీ పోదు, డిపాజిట్‌దారులకు భరోసా ఇచ్చిన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

దేశంలోని నాలుగో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ (Yes Bank) భవిష్యత్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకును ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. యస్‌ బ్యాంకు సంక్షోభం (YES Bank Crisis), డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) స్పందించారు.

Finance Minister Nirmala Sitharaman and RBI Governor Shaktikanta Das (Photo: ANI)

New Delhi, Mar 06: దేశంలోని నాలుగో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ (Yes Bank) భవిష్యత్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకును ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. యస్‌ బ్యాంకు సంక్షోభం (YES Bank Crisis), డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) స్పందించారు.

రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకోరాదు

ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్‌ బ్యాంకు ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

యస్ బ్యాంక్ వద్ద ఉపసంహరణ పరిమితిని పరిమితం చేసిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రైవేట్ రుణదాతను పునరుద్ధరించడానికి సెంట్రల్ బ్యాంక్ త్వరలో "వేగంగా చర్యలు" తీసుకుంటుందని చెప్పారు. "ఎస్ బ్యాంక్ పునరుద్ధరించడానికి ఒక పథకాన్ని ఆర్బిఐ త్వరలోనే అమలు చేయడం మీరంతా వేగంగా చూస్తారని" అని దాస్ ఒక కార్యక్రమంలో చెప్పారు.

బ్యాంకుల మూసివేతపై వస్తున్న అసత్య ప్రచారాలు..

మరోవైపు ఆర్‌బీఐ సరియైన సరైన నిర్ణయం తీసుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష‍్కరించడంలో కేంద్రం,ఆర్‌బీఐ కృషిచేస్తోందన్నారు. యస్‌ బ్యాంకునకు విలువైన ఆస్తులున్నాయనీ ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని అన్వేషిస్తుందని భరోసా ఇచ్చారు. డిపాజిట్‌ దారులు ఆందోళన చెండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

యస్ బ్యాంకు సంక్షోభం, ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ

యస్‌బ్యాంకు సంక్షోభంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (FM Nirmala Sitharaman) పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. డిపాజిట్‌ దారుల సొమ్ముఎక్కడికీ పోదనీ, పూర్తి భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. ఆర్‌బీఐ ఆంక్షలు, డిపాజిటట్‌దారుల ఆందోళన నేపథ్యంలోశుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతి డిపాజిటర్ డబ్బు సురక్షితంగా ఉందనీ, ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

నిండా ముంచిన పీఎంసీ బ్యాంకు, తట్టుకోలేక గుండెపోటుతో ఖాతాదారుడు మృతి

యస్‌ బ్యాంకు విషయంలో ఆర్‌బీఐ సరియైన పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరంగా తీసుకుంటుందని తెలిపారు. ముందుస్తు పరిష‍్కారంకోసం బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ చాలా త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్థికమంత్రి హామీతో యస్‌ బ్యాంకు షేరు భారీగా కోలుకుం​ది.

భారత బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితం 

ఆస్తుల పరంగా ఒకపుడు దేశంలో నాలుగవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్నయస్‌ బ్యాంకు గత ఏడాది కాలంలో ఆర్థిక ఇబ్బందులు, మూల కొరతతో ఇబ్బందులకుతోడు ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ విధించిన మారటోరియం, విత్‌ డ్రా ఆంక్షలతో స్టాక్‌మార్కట్లో యస్‌బ్యాంకు లో షేర్లలో అమ్మకాల వెల్లువెత్తింది.

ఎస్‌బీఐ యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయనుందనే వార్తలతో నిన్న 30 శాతం పైగా ఎగిసాయి. ఇవాళ ఆ లాభాలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. 75 శాతం క్షీణించి 9 స్థాయికి పడిపోయింది. 84.93 శాతం క్షీణించి ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నెల రోజుల పాటు యస్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం (మారటోరియం) విధించింది. బ్యాంక్ బోర్డ్‌ను కూడా రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకుంది.

ముఖ్యంగా యస్ బ్యాంక్ డిపాజిటర్లు రూ. 50 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే ఆంక్షలు విదించింది. ప్రత్యేక అవసరాలు (పెళ్లి, ఆరోగ్యం, తదితర) సందర్భంలో మాత్రం రూ.50వేలకు మించి పొందే అవకాశం ఉంది.

దీంతో ఆందోళనలో పడిపోయిన ఖాతాదారులు తమ సొమ్ము కోసం దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. అటు యస్‌ బ్యాంక్‌ షేర్‌ టార్గెట్‌ ధరను ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్‌ ధరను రూ.1కు తగ్గిస్తున్నట్టు జేపీ మోర్గాన్‌ ప్రకటించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now