The Reserve Bank of India (RBI) | (Photo Credits: PTI)

Mumbai:  ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల బ్యాంకుల మూసివేతకు సంబంధించి వస్తున్న పుకార్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India)  ఖండించింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితం మరియు స్థిరం అని పేర్కొంది. సహకార బ్యాంకులు మరికొన్ని సహా మరికొన్ని ఇతర బ్యాంకులను ఎత్తివేస్తున్నారంటూ కొన్ని చోట్ల పుకార్లు వ్యాపించడంతో బ్యాంక్ డిపాజిటర్లలో ఆందోళన నెలకొంది.  దీని ఫలితంగా ఆర్బీఐ నేరుగా స్పందించింది.

పుకార్లకు సంబంధించిన విషయాలను పలు బ్యాంకులు ఆర్బీఐ (RBI) దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో ఆర్బీఐ స్పందిస్తూ "సహకార బ్యాంకులు అలాగే మరికొన్ని ఇతర బ్యాంకులపై గురించి కొన్ని చోట్ల పుకార్లు వ్యాపించాయి, దీని ఫలితంగా ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది, దీనికి సంబంధించి ప్రజలకు ఆర్బీఐ భరోసా ఇవ్వాలనుకుంటుంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా మరియు సుస్థిరంగా ఉంది. కాబట్టి ఇలాంటి పుకార్ల పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దు". అని ఆర్బీఐ ట్వీట్ చేసింది.  బ్యాంక్ ఖాతాదారుల విత్‌డ్రా పరిమితి పెంపు..

RBI Tweet:

అంతకుముందు, ఆర్బిఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది, నోటీసుల్లో పంజాబ్ బోర్డు మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (PMC Bank) ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అక్టోబర్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు పనిచేయవు..

లోన్ లకు సంబంధించి బ్యాంకులో చాలా అవకతవకలు జరిగినట్లు తాము గుర్తించామని పేర్కొంది. అందుకు బాధ్యుడైన పీఎంసీ బ్యాంక్ ఎండి జాయ్ థామస్‌ను సస్పెండ్ చేసిన ఆర్బీఐ, అతడి స్థానంలో జై భగవాన్ భోరియాను పీఎంసీ బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ఒక దివాలా తీసిన హెచ్‌డిఐఎల్‌ సంస్థకు సస్పెండ్ కాబడిన ఎండీ పరిమితికి మించి రూ .6,500 కోట్లను రుణంగా మంజూరు చేసినట్లు ఆర్బీఐ ఆడిటింగ్ లో తేలింది.