New Delhi,October 1: కళ్లుమూసి తెరిచే లోపు సెప్టెంబర్ నెల వెళ్లిపోయి అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ నెల అంతా పండుగ సంబరాలలో ప్రజలు మునిగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే పండుగ సమయాల్లో కొనుగోళ్లకు డబ్బు చాలా అవసరం.. ఈ డబ్బును ముందే రెడీ చేసుకోండి ఎందుకంటే ఈ నెలలో 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. దసరా, దీపావళి వంటి పండుగుల సీజన్ కావడంతో డబ్బు కూడా ఎక్కువ మొత్తంలో అవసరం పడుతుంది కాబట్టి అకౌంట్ హోల్డర్లు కొంచెం అలర్ట్‌గా ఉండాలని బ్యాంకులు చెబుతున్నాయి. కాగా ఈ నెలంతా పండుగల సీజన్ కాబట్టి ఇతర నెలల కంటే దాదాపు ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆది, శనివారాలు కాకుండా గాంధీ జయంతి, దసరా, దీపావళి, ఇతర నేషనల్ ఈవెంట్ సెలవు దినాలు ఉంటాయి. మొత్తంగా పదకొండు రోజులు మూతబడుతాయి. బ్యాంక్ ఖాతాదారుల విత్‌డ్రా పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే, కొన్ని సెలవు దినాలు ఒక రాష్ట్రంలో ఓ తేదీన ఉంటే మరో రాష్ట్రంలో మరో రోజు ఉండవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినాలు. అలాగే ఆదివారాలు సెలవు ఉంటుంది. వీటితో కలిపి మొత్తంగా 11 రోజులు సెలవులు ఉంటాయి. అంటే అక్టోబర్ నెలలో బ్యాంకులు 20 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. ఈ నెలలో ఏవైనా అవసరాలు ఉండి బ్యాంకును సందర్శించే ముందు సెలవు దినాలు చెక్ చేసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఏదైనా బ్యాంకుపై లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా ఇలా చేయండి !
11 రోజులు సెలవు దినాలు ఇవే
2వ తేదీన గాంధీ జయంతి.
6వ తేదీ ఆదివారం
7వ తేదీ మహానవమి
8వ తేదీ దసరా.
12వ తేదీ రెండో శనివారం
13వ తేదీ ఆదివారం
20వ తేదీ ఆదివారం
26వ తేదీ నాలుగో శనివారం
27వ తేదీ ఆదివారం, 27వ తేదీన దీపావళి కూడా
28వ తేదీన గోవర్ధన్ పూజ, 29వ తేదీన భాయ్ దూజ్
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులు బంద్ ఉంటాయి. అంటే 6, 12, 13, 20, 26, 27 తేదీల్లో సెలవులు ఉంటాయి. వీటితో పాటు అక్టోబర్ 2 (గాంధీ జయంతి), 8వ తేదీ (దసరా) సెలవులు ఉంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎస్‌బీఐ సాహసం
ఆన్ లైన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యథావిథిగా కొనసాగుతాయి. బ్యాంకులతో పని ఉంటే సెలవుల ఆధారంగా ప్లాన్ చేసుకోవాలి. ఏటీఎం సెంటర్లు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే సెలవు దినాలు కాబట్టి మనీ ఉంటుందో ఉండదో చెప్పలేము.