Panicked customers outside a PMC Bank branch in Mumbai | (Photo Credits: PTI)

Mumbai:  పంజాబ్ -మహారాష్ట్ర కోఆపరేటివ్ (PMC) బ్యాంక్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆరు నెలల వరకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎలాంటి లోన్స్ మంజూరు చేకూడదని ఆ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాకుండా ఈ బ్యాంకు ఖాతాదారులకు కూడా రూ. 1000కి మించి నగదు విత్ డ్రా చేసే వీలు లేకుండా పరిమితి విధించింది. దీంతో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది, ఈ బ్యాంకును మూసివేస్తున్నట్లు పుకార్లు కూడా వ్యాపించడంతో తమ డబ్బు కోసం ఖాతాదారులు ఈ బ్యాంకు వద్ద బారులు తీరారు. నగదు విత్‌డ్రా పరిమితిపై ఆందోళన చేపట్టడంతో , దిగివచ్చిన ఆర్బీఐ వీరికి కొంత ఊరటనిచ్చేలా విత్‌డ్రా పరిమితిని రూ.10,000 లకు పెంచింది.

ఇక, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మంజూరు చేసిన రుణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి రావడంతో PMC బ్యాంక్ ద్వారా జరిగే అన్ని రకాల లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. బ్యాంకుల మూసివేతపై వస్తున్న అసత్య ప్రచారాలు..

ఇప్పటికే దివాలా తీసిన హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (HDIL) రియల్ ఎస్టేట్ సంస్థకు PMC బ్యాంక్ నుంచి రూ . 2,500 కోట్ల రుణం లభించింది. ఇడే ఆ PMC బ్యాంక్ పతనానికి ప్రధాన కారణమని ఆర్బీఐ పరిగణిస్తుంది. అందుకు బాధ్యుడిగా PMC బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్ ను ఆర్బీఐ నిరవధికంగా సస్పెండ్ చేసింది. అంతకుముందు థామస్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో HDIL మేనేజింగ్ డైరెక్టర్ సారంగ్ వాధవన్ కూడా తన వ్యక్తిగత పూచీకత్తుపై PMC బ్యాంకు నుండి రూ .100 కోట్ల రుణం తీసుకున్నట్లు అంగీకరించారు.

అయితే థామస్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. HDIL సంస్థకు రూ .2,500 కోట్ల రుణం మంజూరు చేయడం అవాస్తవం అని ఆయన కొట్టిపారేస్తున్నారు. అయితే ఆడిట్ లో మాత్రం లెక్కల్లో చాలా తేడా వచ్చినట్లు తెలుస్తుంది. ఆ సంస్థ ఎండీకి 100 కోట్ల రూపాయలు మంజూరు చేశాననే తానే ఒప్పుకోవడంతో ఖచ్చితంగా ఏదో గోల్ మాల్ జరిగినట్లు ఆర్బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో PMC బ్యాంకులో ఖాతాదారుల సొమ్ముకు భద్రత ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.