Clean Note Policy: క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి, రూ. 2000 నోట్లు ఉపసంహరణ ఈ విధానంలోనే ఎందుకు, RBI వెబ్‌సైట్ క్రాష్ కారణాలేంటి ?

ప్రజలకు మంచి నాణ్యమైన కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ.

RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని సామాన్యులకు, నల్లధనం బాబులకు మరోసారి షాకిచ్చింది. అయితే దీనిపై ఊరటనిస్తూ ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని తెలిపింది. క్లీన్ నోట్ పాలసీ' లో భాగంగానే రెండు వేల రూపాయలను నిలిపివేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

ఆర్‌బీఐ వెబ్‌సైట్ క్రాష్, రూ.2000 నోట్లు ఉపసంహరణ వార్తలతో ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి వెళ్లిన యూజర్లు

ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లు ఉపసంహరణ వార్తలు వెలువడిన కొద్ది సమయంలోనే రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది.

క్లీన్ నోట్ పాలసీ' అంటే ఏమిటి : ప్రజలకు మంచి నాణ్యమైన కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ. ఇందులో భాగంగానే 2016 నోట్లు రద్దు తరువాత రూ.2 వేల నోటునుతీసు‍‍కొచ్చింది.ఇక 2017 మార్చిలో 89 శాతం జారీ చేయగా వాటి జీవిత కాలం 4-5 సంవత్సరాల అంచనా వేసింది.అయితే 2018-19లో 2,000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు పేర్కొంటూ మరో షాక్ ఇచ్చింది.