RBI (Credits: Twitter)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లు ఉపసంహరణ వార్తలు వెలువడిన కొద్ది సమయంలోనే రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది.

2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.అర్థరాత్రి సమయంలో నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు చాలా మంది ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ సందర్శించారు. ఎక్కువ మంది ఒక్కసారిగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయడంలో క్రాష్ అయింది. మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృతమైంది.

ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

దేశంలో బ్లాక్ మనీ తగ్గించడానికి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2000 నోట్లు తీసుకువచ్చారు. అయితే వాటి ముద్రణ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయింది. RBI వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక సారికి కేవలం 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30.