Rs. 2000 Notes Exchange: రెండువేల నోట్లు ఇంకా మార్చుకోలేదా? ఇక్క‌డ కూడా రూ. 2000 నోట్లుమ మార్చుకునేందుకు ఆర్బీఐ అవ‌కాశం

పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి పంప‌వ‌చ్చున‌ని ఆర్బీఐ తెలిపింది. క్లీన్ నోట్ (Clean Note) పాల‌సీలో భాగంగా గ‌తేడాది మే నెల‌లో రూ.2000 నోట్ల‌ను చ‌లామ‌ణి నుంచి ఉపసంహ‌రిస్తున్న‌ట్లు కేంద్రీయ బ్యాంక్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Rs 2000 Note (Photo-X)

Mumbai, JAN 05: గతేడాది మేలో రద్దు చేసిన రూ.2000 విలువైన నోట్ల మార్పిడి (Notes Exchange) కోసం పౌరుల‌కు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. పోస్టాఫీసుల వ‌ద్ద కూడా రూ.2000 విలువైన నోట్లు మార్చుకోవ‌చ్చున‌ని తెలిపింది. దేశంలోని ఆర్బీఐ కార్యాల‌యాల వ‌ద్ద పౌరులు రూ.2000 విలువైన నోట్ల మార్పిడికి (Notes Exchange) బారులు తీరార‌న్న వార్త‌లు రావ‌డంతో కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశంలోని ఏదైనీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాల‌యం, పోస్టాఫీసు వ‌ద్ద రూ.2000 నోట్ల‌ను మార్చుకోవ‌చ్చున‌ని (Notes Exchange) శుక్ర‌వారం తెలిపింది. అయితే రూ.2000 నోట్లు మార్చుకునే పౌరులు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ల‌భిస్తున్న ద‌ర‌ఖాస్తు ఫామ్ నింపి.. పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి పంప‌వ‌చ్చున‌ని ఆర్బీఐ తెలిపింది. క్లీన్ నోట్ (Clean Note) పాల‌సీలో భాగంగా గ‌తేడాది మే నెల‌లో రూ.2000 నోట్ల‌ను చ‌లామ‌ణి నుంచి ఉపసంహ‌రిస్తున్న‌ట్లు కేంద్రీయ బ్యాంక్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) ర‌ద్దు చేసిన‌ప్పుడు 2016లో తొలిసారి రూ.2000 నోటును కేంద్రం ఆదేశాల‌కు అనుగుణంగా ఆర్బీఐ విడుద‌ల చేసింది. రూ.2000 నోట్ల జీవిత కాలం ముగిసింద‌ని, లావాదేవీల కోసం వాటిని ప్ర‌జ‌లు వాడ‌నందున వాటిని ఉపసంహ‌రిస్తున్న‌ట్లు తెలిపింది.

RBI Guidelines: మినిమం బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు వేయొద్దు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు, అన్ క్లైయిమ్డ్ డిపాజిట్లపై పలు సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్  

గ‌త మే నెల నాటికి చ‌లామ‌ణిలో ఉన్న రూ.2000 నోట్ల‌లో 97.38 శాతానికి పైగా క‌రెన్సీ త‌మ వ‌ద్ద‌కు తిరిగి వ‌చ్చింద‌ని ఆర్బీఐ తెలిపింది. చ‌లామ‌ణి నుంచి ఉప‌సంహ‌రించిన రూ.2000 నోట్ల మార్పిడికి, డిపాజిట్ల‌కు దేశంలోని అన్ని బ్యాంకుల కౌంట‌ర్లు, ప‌లు చాన‌ళ్ల‌ను ఏర్పాటు చేసింది. ఏ వ్య‌క్తి అయినా స‌రే ప్ర‌తి రోజూ ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాల‌యాల వ‌ద్ద గానీ, పోస్టాఫీసుల వ‌ద్ద గానీ రూ.20 వేల లోపు విలువ గ‌ల రూ.2000 నోట్ల మార్పిడికి అనుమ‌తి ఇచ్చింది.