Recurring Defect In Car: కారు బ్రేకులు ఫెయిలయినందుకు రూ.60 లక్షలు జరిమానా, ఆడి కారు యజమానికి చెల్లించాలంటూ వోక్స్ వాగన్ డీలర్‌కు వినియోగదారుల కోర్టు ఆదేశం

తమిళనాడు స్టేట్ కన్సుమర్ డిస్ప్యూట్ రెడ్సెస్సల్ కమిషన్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఒక కారు డీలర్ కు రూ. 60,08,000 జరిమానా విధించింది. వినియోగదారుడు కొన్న ఆడి కారులో బ్రేక్ మెకానిజంలో లోపం ఏర్పడింది.

Volkswagen Group Asked to Refund (PIC @ Twitter)

Chennai, FEB 03: కారులో లోపం కారణంగా ఒక వినియోగదారుడికి భారీగా జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది తమిళనాడు వినియోగదారుల కోర్టు. తమిళనాడు స్టేట్ కన్సుమర్ డిస్ప్యూట్ రెడ్సెస్సల్ కమిషన్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఒక కారు డీలర్ కు రూ. 60,08,000 జరిమానా విధించింది. వినియోగదారుడు కొన్న ఆడి కారులో బ్రేక్ మెకానిజంలో లోపం ఏర్పడింది. దీనిపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు...తీర్పు ఇచ్చింది. రూ.30 లక్షల మేర జరిమానాతో పాటూ ఆడి క్యూ 7 కారులో బ్రేక్ విభాగాన్ని రీప్లేస్ చేయాలని సూచించింది.

అయితే కారులో యూనిక్ బ్రేకింగ్ సిస్టమ్ లో ఉందని డీలర్ ఒక బ్రోచర్‌ ను ముద్రించి ప్రచారం చేశాడు. దాంతో ఆ బ్రోచర్ ఆధారంగా కోర్టులో కేసు వేశాడు. అయితే కారు కొన్న కొద్దిరోజులకే బ్రేకుల్లో ఇబ్బంది రావడంతో డిస్క్‌ లు మార్చాడు. దానికి దాదాపు రూ. 3 లక్షల మేర ఖర్చయింది. దాంతో 2014 జులైలో కేసు వేశాడు కస్టమర్. దానిపై సుధీర్ఘంగా వాదనలు జరిగాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif