Unlock 1: దేశ వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు,ప్రార్థనామందిరాలు, సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఓ సారి తెలుసుకోండి

టి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు (Religious Places Reopen Across India) తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 5 అమలులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మినహాయింపులు ఇచ్చింది. దీంతో నేటి నుంచి ఆలయాలుదర్శనానికి భక్తులకు అనుమతి (Devotees Offer Prayers at Temples) ఇచ్చారు దేవాలయాలు, మసీదులు, చర్చిలు (Churches, Mosques) నేటి నుంచి తెరుచుకోనున్నాయి.అయితే అన్ని చోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో ముందుగా రెండు రోజుల పాటు ఆలయ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత సామాన్య భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలు నేటి నుంచి తెరుచుకున్నాయి.

Religious Places Reopen Across India (Photo-ANI)

New Delhi, June 8: నేటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు (Religious Places Reopen Across India) తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 5 అమలులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మినహాయింపులు ఇచ్చింది. దీంతో నేటి నుంచి ఆలయాలుదర్శనానికి భక్తులకు అనుమతి (Devotees Offer Prayers at Temples) ఇచ్చారు దేవాలయాలు, మసీదులు, చర్చిలు (Churches, Mosques) నేటి నుంచి తెరుచుకోనున్నాయి.అయితే అన్ని చోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఎనభై రోజుల తర్వాత అన్నీ ఓపెన్, కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌, ఇంకా అనుమంతిచబడనివి ఏంటో ఓ సారి తెలుసుకోండి

ప్రధాన ఆలయాల్లో ముందుగా రెండు రోజుల పాటు ఆలయ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత సామాన్య భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలు నేటి నుంచి తెరుచుకున్నాయి.

Delhi Chhatarpur temple

Karnataka Sharana Basaveshwara Temple

Delhi छत्तरपुर मंदिर

మార్చి 20 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు నేటి ఉదయం తెరుచుకున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత శ్రీవారి ఆలయం తెరుచుకుంటున్న నేపథ్యంలో తిరుమలను పలు రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు టీటీడీ ఉద్యోగులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 11 వ తేదీ నుంచి అందరు భక్తులకు అవకాశం కల్పిస్తారు. రోజుకు ఐదు వేల మందికి మాత్రమే తిరుమల లో శ్రీవారి దర్శనం ఉంటుంది.

Delhi Fatehpuri Masjid

Harmandir Sahib (Golden Temple) in Amritsar

Karnataka Saint Mary’s Church

సామాజిక దూరం పాటించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ఉద్యోగులతో ట్రయిల్ రన్ ప్రారంభించారు. నేడు, రేపు శ్రీవారి ఆలయం ఉద్యోగులు, సిబ్బంది, జూన్ 10వ తేదీన స్థానికులకు, జూన్ 11 నుంచి రెగ్యూలర్‌గా భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించేందుకే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Mata Vaishno Devi Gufa Yog Mandir in Dehradun

Delhi: Sai Baba Mandir

నిబంధనలకు లోబడి 65ఏళ్లు పైబడిన వృద్ధులు, 10ఏళ్ల లోపు చిన్నారులకు ఆలయ ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేశారు. గంటకు 500 మంది చొప్పున ఈరోజు 5600 టిక్కెట్లు టీటీడీ ఉద్యోగులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ప్రార్థనా మందిరాలకు మార్గదర్శకాలివే..

1.పాదరక్షకాలు పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి.

2.గుడి పరిసరాల్లోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్లు సోప్‌తో శుభ్రం చేసుకోవాలి.

3.చేతులు, కాళ్లు శుభ్రం చేసుకునే ప్రదేశాల్లో శుభ్రత పాటించాలి.

4.భౌతిక దూరం పాటించాలి. సామూహికంగా కూర్చోవడంపై నిషేధం.

5.విగ్రహాలు, పవిత్ర గ్రంధాలు, మజర్లను తాకడం నిషేధం.

6.భక్తులు ఎవరి మ్యాట్‌లను వారే తెచ్చుకోవాలి.

7.ప్రసాదం, తీర్థం వంటివి ఇవ్వడం నిషేధం.

8.భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదానం చేసుకోవచ్చు.

9.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే దర్శనాలు.

10.మాస్కు లేకుంటే ప్రవేశం ఉండదు.

11.దర్శన సమయంలో క్యూ పాటిస్తూ మార్కింగ్ చేసిన సర్కిల్‌లో ఉండాలి.

12.తలనీయాలు తీయడం నిషేధం.

13.ప్రదక్షిణలు చేసుకునే అవకాశం ఉంది.

14.ఆరోగ్యం సరిగా లేని వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారు దర్శనానికి నిషేధం.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now