‘Aye Watan’ On Russian Cadets Lips: రష్యా సైనికులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఇండియా దేశభక్తి గీతం, ట్విట్టర్లో వైరల్ అవుతున్న మహమ్మద్ రఫీ హామ్‌కో తేరి కసం సాంగ్, 1965లో వచ్చిన షహీద్ మూవీని ఆలపించిన రష్యన్ మిలిటరీ

ఆయన పాడిన దేశభక్తి గీతం Ae watan, ae watan, hamko teri kasam సాంగ్ అప్పడూ ఎప్పుడూ ఆణిముత్యమే. 1965లో వచ్చిన బాలీవుడ్ మూవీ Shaheedలో ఈ పాటను రఫీ సాబ్ ఆలకించారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటారా..ఈ పాట ఇప్పుడు రష్యాలో మారు మోగుతోంది.

Russian Military Cadets Seen Singing Indian Patriotic Song Mohammad Rafi Humko Teri Kasam: Watch (Photo-ANI)

New Delhi, November 30: అలనాటి బాలీవుడ్ మధుర గాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆయన పాడిన దేశభక్తి గీతం Ae watan, ae watan, hamko teri kasam సాంగ్ అప్పడూ ఎప్పుడూ ఆణిముత్యమే. 1965లో వచ్చిన బాలీవుడ్ మూవీ Shaheedలో ఈ పాటను రఫీ సాబ్ ఆలకించారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటారా..ఈ పాట ఇప్పుడు రష్యాలో మారు మోగుతోంది.

ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థలను కలిగి ఉన్న దేశాల్లో రష్యా ఒక్కటనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటి రష్యా (Russia) మిలిటరీలో పని చేసేవారిలో స్పూర్తిని నింపేందుకు ఆ దేశ మిలిటరీ వ్యవస్థ మన భారతీయ సాంగ్‌ హామ్ కో తేరి కసంను వాడుకుంది.

1965లో బాలీవుడ్ సినిమా "షాహీద్" కోసం మొహమ్మద్ రఫీ రాసిన "హామ్ కో తేరి కసం" (Humko Teri Kasam)అంటూ సాగే దేశభక్తి పాట(Indian Patriotic Song)ను రష్యన్ మిలిటరీ రష్యన్ యువ సైనికులు(Russian military cadets), వారి కుటుంబాలను ఉత్తేజపరిచేందుకు వినియోగించింది. ఈ దేశభక్తి సాంగ్ ఆలపిస్తూ రష్యన్ మిలిటరీ సభ్యులు (Russian army cadets) పాటకు ట్యూన్ కలిపారు. అందరూ ఈ పాటను దేశభక్తితో పాడటంతో నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Watch Video of Russian Military Cadets Singing "Ae Watan" Song:

మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో సైనిక సలహాదారు బ్రిగేడియర్ రాజేష్ పుష్కర్ (Brigadier Rajesh Pushkar, the Military Advisor at the Indian Embassy in Moscow) కూడా వీడియోలో పాట పాడటం చూడవచ్చు. భారత్, రష్యా మధ్య స్నేహపూర్వక వాతావరణంను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

రష్యన్ మిలటిరీకే కాదు పాట వింటున్నవారికి గూస్ బంప్స్ వచ్చేలా ఈ పాట ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో అక్కడ సీనియర్ భారత సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. ట్విట్టర్‌(Twitter)లో ప్రస్తుతం ఈ వీడియోని లక్షల మంది చూశారు.