Putin Heaps Praise on PM Modi: ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియానే సూపర్ పవర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడి
తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు.
New Delhi, Nov 8: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌పై మరోసారి ప్రశంసలు వర్షం కురిపించారు.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో చేర్చేందుకు ఇండియాకు ఆ అర్హత ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు.
భారత్- రష్యా (Russia- India)ల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈమేరకు సోచిలోని వాల్డాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. భారత్‌తో అన్ని రంగాల్లోనూ సంబంధాలను రష్యా పెంచుకుంటోందని, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నమ్మకం పెరిగిందన్నారు.
సూపర్ పవర్ దేశాల జాబితాలో ఇండియాను జోడించాలని, దీంట్లో డౌట్ లేదన్నారు. 140 కోట్ల జనాభాతో.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతోందన్నారు. భారత్ గొప్ప దేశమని పుతిన్ తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఇండియా లీడింగ్‌లో ఉందన్నారు. భారత్, రష్యా మధ్య సెక్యూర్టీ, రక్షణ రంగాల్లో సంబంధాలు బలపడినట్లు చెప్పారు. భారత సైన్యం వద్ద రష్యా సైనిక ఆయుధాలు చాలా ఉన్నాయని, తమ మధ్య నమ్మకమైన బంధం పెరిగిందన్నారు. భారత్‌కు ఆయుధాలు అమ్మడమే కాదు, వాటిని మేం డిజైన్ కూడా చేస్తామని ఆయన అన్నారు. బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్‌కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉంది. భద్రత, రక్షణరంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఏడాదికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లుగా ఉంది’ అని పుతిన్ పేర్కొన్నారు.
ఈసందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం ఆవిర్భవించడంలో సోవియెట్ యూనియన్ పాత్రను పుతిన్ గుర్తుచేసుకున్నారు. ఇటీవల రష్యాలోని కజన్ వేదికగా జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత ఆర్థికవృద్ధి విజయవంతంగా ముందుకెళ్తుందంటూ ప్రశంసించారు.