Shirdi Bandh: షిర్డీ బంద్, సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలకు నిరసనగా బంద్ ప్రకటించిన షిర్డీ గ్రామస్తులు, ఆలయం తెరిచే ఉంటుందన్న ట్రస్ట్, పత్రిలో కూడా బంద్ ప్రకటించిన పత్రి కృతి సమితి, రాజకీయ వివాదంగా మారుతున్న సాయి జన్మస్థల అంశం

సీఎం ఉద్దశ్ థాకరే వ్యాఖ్యలతో మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం(Sai Baba Birthplace Row) ముదురుతోంది. పత్రిని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్(Shirdi Bandh) పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే బాబా ఆలయం(Sai Baba,Sai Baba temple) మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు కొనసాగుతాయని సాయి బాబా సంస్థాన్ ట్రస్టు(Shirdi Sai Baba Temple Trust) వెల్లడించింది.

Shirdi Bandh (Photo Credits: ANI)

Mumbai, January 19: సీఎం ఉద్దశ్ థాకరే వ్యాఖ్యలతో మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం(Sai Baba Birthplace Row) ముదురుతోంది. పత్రిని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్(Shirdi Bandh) పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే బాబా ఆలయం(Sai Baba,Sai Baba temple) మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు కొనసాగుతాయని సాయి బాబా సంస్థాన్ ట్రస్టు(Shirdi Sai Baba Temple Trust) వెల్లడించింది.

సంస్థాన్‌కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాలు తదితరాలన్నింటిలో కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. బంద్‌కు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే పత్రి కృతి సమితి కూడా ఆదివారం నుంచి పత్రిలో బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించింది.

జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు

ముఖ్యమంత్రి (CM Uddhav Thackeray) ప్రకటనకు నిరసనగా ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌లో దాదాపు 20 గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు.

Here's the tweet:

గతంలోనూ ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హోటళ్లలో బుకింగ్‌ చేసుకున్న భక్తులకు, విమానాల్లో వచ్చే భక్తులకు బంద్‌తో ఎలాంటి అసౌకర్యం ఉండదని, దుకాణాలు మాత్రమే మూతబడి ఉంటాయని వారు తెలిపారు.

Sai Baba Temple Remains Open 

పర్భాణీ జిల్లా పత్రిలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే ప్రకటించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. పత్రి సాయి జన్మస్థలం అని చెప్పేందుకు ఆధారాలు లేవని షిర్డీ వాసులు చెబుతున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధీకులందరితో సీఎం ఉద్ధవ్ త్వరలోనే సమావేశం కానున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

యాదాద్రి చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి

ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. సాయిబాబా జన్మస్థలంపై ఇంతవరకు వివాదం లేదని... కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే సాయి జన్మస్థల వివాదం తెరపైకి వచ్చిందని ఆరోపించింది. బాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడు నిర్ధారించలేడని ఇలాంటి తరహా రాజకీయంకొనసాగితే షిర్డీ వాసులు న్యాయ పోరాటం చేస్తారని బీజేపీ నేతలు హెచ్చరించారు.

శబరిమల కొండల్లో అపురూప ఘట్టం

పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఎన్సీపీ నేత దుర్రానీ అబ్దుల్లా చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు. పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ..బాబా జన్మస్థలంపై వివాదం కారణంగా పత్రిలో భక్తులకు సౌకర్యాల కల్పనను అడ్డుకోవడం సరికాదన్నారు.

అతి ముఖ్యమైన తీర్థ యాత్రల్లో షిర్డీ ఆలయం ఒకటి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. తాజాగా షిర్డీ వాసులు ఇచ్చిన బంద్‌తో భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now