Makaravilakku / Makara Jyothi Darshanam 2020 at Sabarimala temple. | (Photo Credits: IANS)

Sabarimala,  January 15:  శబరిమలలో బుధవారం అయ్యప్ప స్వామి 'మకర జ్యోతి'  (Makara Jyothi) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం సన్నిధి నుంచి దివ్య జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు తన్మయత్వంతో పులకరించిపోయారు.  మకరజ్యోతిని దర్శించుకుంటున్న సమయంలో లక్షలాది భక్తుల గొంతుకలు ఒక్కసారిగా 'స్వామియే శరణం అయ్యప్పా' అంటూ శరణు వేడటంతో   శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో ప్రతిధ్వనించాయి.

ఈ అపురూప ఘట్టాన్ని మళయాలంలో 'మకరవిలక్కు' (Makaravilakku)  అని కూడా అంటారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం (Ayyappa Temple) లో ఇది ప్రతీ ఏడాది జరిగే ఉత్సవం. భానుడు ధనస్సు రాశి నుండి మకరరాశిలో ప్రవేశించిన సమయంలో, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మకర సంక్రాంతి రోజున సాయంత్రం శబరిమల కొండలలోని పొన్నాంబలం మేడుపై 'మకరజ్యోతి దర్శనం' కలుగుతుంది. ఈ ఏడాది సంక్రాంతి గడియలు జనవరి 15, ఉదయం 2:22 గంటలకు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈరోజు సూర్యాస్తమయం సమయానికి 'జ్యోతి' దర్శనం కలిగింది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తుల సౌకర్యార్థం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

స్వామి దర్శనం కోసం ఇప్పటికే భారీఎత్తున అయ్యప్ప భక్తులు దేవస్థాన సన్నిధికి చేరుకున్నారు.  ఈ ఏడాది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 5 లక్షల మంది స్వాములు శబరిమల వెళ్లినట్లు అంచనా.

Check Pics of Makaravilakku 2020 Makar Jyothi:

Makaravilakku Makar Jyothi

మకరజ్యోతి 2020 దర్శనం ప్రత్యక్ష ప్రసారం:

ప్రతీ ఏడాది జనవరి రెండో వారంలో నిర్వహించే 'మకరవిలక్కు' ఉత్సవంలో భాగంగా అయ్యప్ప స్వామి అలంకరణ కోసం కేరళలోని పండల రాజ వంశస్తులు తీసుకువచ్చే పవిత్రమైన ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సాయంత్రం సూర్యాస్తమయం జరిగే సమయానికి కొద్దిసేపటి ముందు స్వామికి అలంకరిస్తారు. అనంతరం స్వామికి తొలి హారతి ఇచ్చే సమయంలో దేవస్థానానికి 4 కిలోమీటర్ల మేర దూరంలో ఉండే పొన్నాంబలం మేడుపై దివ్యమైన జ్వాల, మకర జ్యోతి దర్శనం కలుగుతుంది.  నల్లటి దుస్తులు ధరించి అయ్యప్ప మాల దీక్షలో భాగంగా ఆచరించే 41 రోజులుగా స్వాములు చేసిన కఠోరమైన ఉపవాస దీక్ష మకరవిలక్కు ఉత్సవంతో ముగుస్తుంది.