Sanatana Dharma Remark: తన తల నరుకుతానన్న ఆచార్య దిష్టి బొమ్మలు దహనం చేయకండి, డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాసిన ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ అంశంపై డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు.
Chennai, Sep 7: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ అంశంపై డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. ద్రావిడ సమానత్వానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన ముఖ్యమంత్రి MK స్టాలిన్ కుమారుడు ఉదయనిధి.. "DMK ఏ మతానికి వ్యతిరేకం కాదు" అని లేఖలో పేర్కొన్నారు.
డిఎంకె దివంగత సిద్ధాంతకర్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై వ్యాఖ్యలను గుర్తు చేస్తూ..'ఒక మతం సమానత్వం, కులరహిత సమాజాన్ని ప్రకటిస్తే అతను ఆధ్యాత్మిక వ్యక్తి అవుతాడు, అయితే ఒక మతం కులతత్వాన్ని ప్రోత్సహిస్తే దానిని మొదట వ్యతిరేకించేది తానేనని ఉదయనిధి లేఖలో అన్నారు. తన తల నరికిన వారికి 10 కోట్ల రూపాయల బహుమానం ప్రకటించిన అయోధ్య సీయర్ పరమహంసపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
జ్ఞాని, పరమహంసల దిష్టిబొమ్మలను దహనం చేయొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన ప్రకటనను వక్రీకరించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన వ్యాఖ్యలను వక్రీకరించారని డిఎంకె యువ వారసుడు అన్నారు.దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వాటితో పాటుగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఉదయనిధి స్టాలిన్ ఒక బహిరంగ కార్యక్రమంలో పేర్కొన్నారు.
దేశంలోని హిందువుల నిర్మూలనకు ఉదయనిధి పిలుపునిచ్చారని ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొనడంతో బీజేపీ జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావనకు వచ్చింది.