SBI Credit Card Holders ALERT: బాదుడే బాదుడు! ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు బ్యాడ్ న్యూస్, ఇక నుంచి ఈఎంఐ ఆప్షన్ పెడితే చార్జీల మోతే, రెంట్ పే అంటూ డబ్బులు డ్రా చేస్తే చార్జీలు చెల్లించాల్సిందే! భారీగా చార్జీలు పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం

ఆ రెంటు పేమెంట్‌తోపాటు రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ రూ.17.82 చెల్లించాలి. ఇప్పటి వరకు రెంట్‌ పేమెంట్స్‌ మీద చార్జీలు విధించ లేదు. కానీ, ఇక నుంచి రెంటల్‌ పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేయనున్నది. అంటే, రెంట్‌ పేమెంట్‌ మీద రూ.99+ చార్జీలు, పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

State Bank of India (Photo Credits: PTI)

Mumbai, OCT 15: ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంకు బాటలో ఎస్బీఐ ప్రయాణిస్తున్నది. రెంట్‌ పేమెంట్స్‌పై (rental payments) చార్జీలు వసూలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. అంటే ఎస్బీఐ క్రెడిట్‌ కార్డు (SBI Credit Card) యూజర్లు నెలవారీగా రెంట్‌ పేమెంట్‌ చేస్తే కొత్తగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రెంట్‌ పేమెంట్స్‌పై చార్జీలు (Rent Payments) వసూలు చేయలేదు ఎస్బీఐ. అంతే కాదు.. నెలవారీగా ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై (EMI transactions) ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు ప్రాసెసింగ్‌ ఫీజు పెంచి వేసింది. పెరిగిన ఫీజులు, చార్జీలు వచ్చేనెల 15 నుంచి అమల్లోకి వస్తాయని శనివారం ప్రకటించింది ఎస్బీఐ కార్డు. వీటికి అదనంగా 18 శాతం జీఎస్టీ (GST) వడ్డింపు ఉంటుంది. ఈ మేరకు తన ఖాతాదారులకు ఎస్బీఐ ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజు రూ.99కి అదనంగా రూ.100 పెంచుతున్నట్లు వెల్లడించింది.

రెంటల్‌ చార్జీతోపాటు ఈఎంఐ ప్రాసెసింగ్‌ ఫీజులపై జీఎస్టీ 18 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని ఈఎంఐగా మారిస్తే.. ప్రస్తుతం 99+ పన్నులు వసూలు చేస్తూ వచ్చింది. వచ్చే నెల 15 నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు (Proccecing Fee) రూ.100 పెంపుతో రూ.199+ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నెల వారీగా రూ.12 వేలు రెంట్‌ పే చేస్తున్నారనుకుందాం. ఆ రెంటు పేమెంట్‌తోపాటు రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ రూ.17.82 చెల్లించాలి. ఇప్పటి వరకు రెంట్‌ పేమెంట్స్‌ మీద చార్జీలు విధించ లేదు. కానీ, ఇక నుంచి రెంటల్‌ పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేయనున్నది. అంటే, రెంట్‌ పేమెంట్‌ మీద రూ.99+ చార్జీలు, పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

SBI: బ్యాంక్‌కు వెళ్లే పని లేదు, ఇకపై వాట్సాప్ ద్వారానే SBI మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ బ్యాలన్స్ పొందవచ్చు, హాయ్ చెప్పడం ద్వారా ఈ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకోండి 

ఇప్పుడు బ్యాంకులు థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సంస్థలు అందిస్తున్న ‘రెంట్‌పే’ ఆప్షన్‌ మీద ఫోకస్‌ పెట్టాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా స్వల్ప చార్జీలతో రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను థర్డ్‌ పార్టీ పేమెంట్స్‌ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ తన క్రెడిట్‌ కార్డు యూజర్లు జరిపే రెంట్‌ పేమెంట్‌ ట్రాన్సాక్షన్లపై రూ.99+ ప్రకారం చార్జీలు వసూలు చేయనున్నది. ఇంతకుముందు ప్రముఖ ప్రయివేట్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌.. రెంట్‌ పేమెంట్స్‌ మీద ఒక శాతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులపై రెంట్‌ పేమెంట్స్‌ జరిపితే వసూలు చేసే ఒకశాతం చార్జీ ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నది. ఐసీఐసీఐ బ్యాంకు బాటలోనే ఎస్బీఐ ప్రయాణించనున్నది.

SBI 2-Wheeler Loan: కొత్త బైక్ లేదా స్కూటర్ కొంటున్నారా, అయితే SBI నుంచి Easy Ride Loan, వడ్డీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 

వాస్తవంగా రెంట్‌ పేమెంట్‌, మెయింటెనెన్స్‌ పేమెంట్స్‌ అనేవి బయటకు చెప్పే కబుర్లేనని అంటున్నారు. నిజంగా జరుగుతున్నది వేరని ఆర్థిక వేత్తలు, బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు. పలువురు క్రెడిట్‌ కార్డు యూజర్లు తమకు క్యాష్‌ అవసరమైనప్పుడు రెంటల్‌ పేమెంట్స్‌, మెయింటెనెన్స్‌ ఆప్షన్‌ ఎంచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.  క్రెడ్‌ (Cred), పేటీఎం(Paytm), మైగేట వంటి థర్డ్‌ పార్టీ యాప్‌లు క్రెడిట్‌ కార్డు యూజర్లకు నామమాత్రపు చార్జీ పేమెంట్‌ ద్వారా రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ కల్పించాయి. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ పేమెంట్‌ చేస్తే క్రెడ్‌ సంస్థ 1-1.75 శాతం సర్వీసు చార్జీ వసూలు చేస్తున్నది. ఇక నుంచి ఈ సర్వీస్‌ చార్జీతోపాటు రెంట్‌పేమెంట్‌ ఫీజు, జీఎస్టీ అదనంగా పే చేయాల్సి ఉంటుంది.

క్రెడిట్‌ కార్డుల నుంచి నేరుగా క్యాష్‌ లావాదేవీలు జరిపితే భారీగా ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తప్పించుకోవడానికి క్రెడిట్‌ కార్డు యూజర్లు థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సంస్థలు ఇచ్చిన ఆప్షన్‌ ఎంచుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలోనే ఎస్బీఐ, ఇంతకుముందు ఐసీఐసీఐ బ్యాంక్‌.. రెంట్‌ పేమెంట్స్‌పై చార్జీలు అమల్లోకి తీసుకొచ్చాయి. రెంటల్‌ పేమెంట్స్‌ మీద ఇతర బ్యాంకులు కూడా చార్జీలు వసూలు చేయనున్నాయని సమాచారం.